Asianet News TeluguAsianet News Telugu

లక్ష్మీస్ ఎన్టీఆర్ కలెక్షన్స్.. లేటెస్ట్ అప్డేట్!

ఎలక్షన్స్ ను హిట్టేక్కిస్తోన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కలెక్షన్స్ ను కూడా గట్టిగానే అందుకుంటోంది. ముందు నుంచే ఈ కాంట్రవర్సీ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెరిగాయి. అందుకే తెలంగాణలో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఫైనల్ గా ప్రవాసుల మనసును కూడా వర్మ దోచేశాడు. 

lakshmis ntr collections latest update
Author
Hyderabad, First Published Apr 1, 2019, 9:11 PM IST

ఎలక్షన్స్ ను హిట్టేక్కిస్తోన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కలెక్షన్స్ ను కూడా గట్టిగానే అందుకుంటోంది. ముందు నుంచే ఈ కాంట్రవర్సీ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెరిగాయి. అందుకే తెలంగాణలో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఫైనల్ గా ప్రవాసుల మనసును కూడా వర్మ దోచేశాడు. 

లేటెస్ట్ గా సినిమాకు  సంబందించిన కలెక్షన్స్ ని చుస్తే ఈ వారం కూడా సినిమా కలెక్షన్స్ గట్టిగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా సినిమా ఇప్పటివరకు  $243,720 డాలర్స్ ను రాబట్టినట్లు తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ కెరీర్ లో ఇదే బెస్ట్ యూఎస్ రికార్డ్. తెలంగాణాలో కూడా సినిమా జోరు దక్కడం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమాను భారీగా రిలీజ్ చెయ్యాలని నిర్మాత రాకేష్ రెడ్డి హై కోర్టు చుట్టూ తీరుగుతున్నాడు. 

ఒకవేళ ఏపీలో రిలీజ్ అయితే అక్కడే ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు సినిమా ప్రమోషన్స్ రేంజ్ పెంచేలా ట్విట్టర్ లో పోస్ట్ లు వైరల్ అయ్యేలా చేస్తున్నాడు. మరి మొత్తంగా సినిమా ఎంతవరకు లాభాలను అందిస్తుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios