Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ బయోపిక్: రెస్ట్ వద్దంటున్న క్రిష్!

నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తోన్న బయోపిక్ షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి చాలా సమయం పట్టింది. ఎనౌన్స్ చేసిన తరువాత బ్రేకులు చాలానే పడ్డాయి. అయితే ఎప్పుడైతే దర్శకుడు క్రిష్ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి సినిమా షూటింగ్ వేగం ఏ మాత్రం తగ్గడం లేదు. 

krish busy with ntr biopic no rest
Author
Hyderabad, First Published Nov 29, 2018, 8:50 PM IST

నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తోన్న బయోపిక్ షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి చాలా సమయం పట్టింది. ఎనౌన్స్ చేసిన తరువాత బ్రేకులు చాలానే పడ్డాయి. అయితే ఎప్పుడైతే దర్శకుడు క్రిష్ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి సినిమా షూటింగ్ వేగం ఏ మాత్రం తగ్గడం లేదు. 

కథానాయకుడు బాలకృష్ణ రెస్ట్ లేకుండా మొన్నటి వరకు బిజీ బిజీగా షూటింగ్ లలో పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల దృష్ట్యా ప్రచారంలో పాల్గొనాలని ఆదేశాలు రావడంతో డిసెంబర్ 6వ తేదీ వరకు షూటింగ్ కు బ్రేక్ చెప్పాడు. అయితే ముందు నుంచు షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న క్రిష్ కు ఇప్పుడు బాలయ్య లేకపోవడంతో షెడ్యూల్ క్యాన్సిల్ చేయడానికి ఒప్పుకోలేదు. 

తరువాత నటీనటుల కాల్షీట్స్ దొరకవని ఇబ్బందిగా మారుతుందని వీలైనంత వరకు బాలకృష్ణ లేని సన్నివేశాలను ఫినిష్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సాధారణంగా రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకొని వర్క్ చేసే క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ కోసం అసలు ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ ని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేసి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే సెకండ్ పార్ట్ ని రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios