Asianet News TeluguAsianet News Telugu

'కేజీఎఫ్' 10 రోజుల ఆంధ్రా/ తెలంగాణా కలెక్షన్స్ (ఏరియావైజ్)

కన్నడ సినిమా 'కేజీఎఫ్'  ను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ  సినిమా విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు వసూళ్ల సంచలనం సృష్టిస్తూనే ఉంది. రోజు రోజుకు సినిమా రచ్చ పెరుగుతోందే కానీ తగ్గడం లేదు.

KGF 10 Days AP/TS Collections
Author
Hyderabad, First Published Jan 1, 2019, 9:29 AM IST

కన్నడ సినిమా 'కేజీఎఫ్'  ను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ  సినిమా విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు వసూళ్ల సంచలనం సృష్టిస్తూనే ఉంది. రోజు రోజుకు సినిమా రచ్చ పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీల్లో కూడా కేజీఎఫ్ అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది. వారం రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల మార్క్ అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. 

మొదట ఈ సినిమాకు ముందు కనీసం పోస్టర్ ఖర్చులైనా వస్తాయా అని నవ్వుకున్న వాళ్ళు  ఇప్పుడుకలెక్షన్స్ జోరు చూసి షాక్ అయ్యి చూస్తున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా సంచలన విజయం సాధించింది.  పది రోజులు దాటినా ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తోంది ఈ చిత్రం.

ఏరియావైజ్ బ్రేకప్:

నైజాం : Rs 2.85 కోట్లు

సీడెడ్ : Rs 1.45 కోట్లు

వైజాగ్ : Rs 82  లక్షలు

ఈస్ట్ గోదావరి : Rs 39 లక్షలు

వెస్ట్ గోదావరి : Rs 33 లక్షలు

కృష్ణా : Rs 61 లక్షలు

గుంటూరు : Rs 58 లక్షలు

నెల్లూరు : Rs 14 Lakhs

మొత్తం  ఆంథ్రా/తెలంగాణా షేర్   : Rs 7.71 కోట్లు

ఈ సినిమాను రాజమౌళి, ప్రభాస్ వంటి స్టార్లు ప్రమోట్ చేయటం  ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. దాంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.  పక్కా మాస్ తరహాలో సినిమాను తెరకెక్కించారు. కన్నడ రాక్ స్టార్ యాష్ నటన ఆకట్టుకోవడంతో.. సినిమా సక్సెస్ అయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios