Asianet News TeluguAsianet News Telugu

కాంచన 3: పాట కోసం కోటిన్నర ఖర్చు!

సౌత్ మల్టి టాలెంటెడ్ పర్సన్ రాఘవ లారెన్స్ ఏది చేసిన స్టైల్ గానే ఉంటుంది. దెయ్యాలతో అందరూ బయపెడుతుంటే... ఈ స్టార్ కొరియోగ్రాఫర్ మాత్రం ఎమోషన్ ని క్రియేట్ చేస్తూ మంచి దెయ్యాలని తెరపై అద్భుతంగా చూపిస్తున్నాడు.

kanchana 3 latest update
Author
Hyderabad, First Published Apr 14, 2019, 11:23 AM IST

సౌత్ మల్టి టాలెంటెడ్ పర్సన్ రాఘవ లారెన్స్ ఏది చేసిన స్టైల్ గానే ఉంటుంది. దెయ్యాలతో అందరూ బయపెడుతుంటే... ఈ స్టార్ కొరియోగ్రాఫర్ మాత్రం ఎమోషన్ ని క్రియేట్ చేస్తూ మంచి దెయ్యాలని తెరపై అద్భుతంగా చూపిస్తున్నాడు. రాఘవ నటిస్తూ దర్శకత్వం వహించిన కాంచన 3 కోసం ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

అయితే ఈ సినిమాలో ఒక పాట కోసం దాదాపు కోటిన్నర ఖర్చు పెట్టిన్నట్లు తెలుస్తోంది. హై విజువల్స్ తో 1400 మంది జూనియర్ ఆర్టిస్టులతో 6 రోజుల పాటు గ్యాప్ లేకుండా చిత్రీకరించిన ఆ సాంగ్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తుందట. మరోసారి లారెన్స్ తన నట విశ్వరూపాన్ని చూపించడం ఖాయమని ట్రైలర్ తోనే తెలిసిపోయింది. 

ఓవియా - వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను లారెన్స్ సొంత ప్రొడక్షన్స లో నిర్మించాడు.కాంచన 3 సినిమాను  తెలుగులో ఠాగూర్ మధు ఈ నెల 19న రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios