Asianet News TeluguAsianet News Telugu

అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్

నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో తెరకెక్కిన 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ జెఆర్సీ ఫంక్షన్హాల్ లో జరుగుతోంది. ఈ వేడుకకు నందమూరి కుటుంబంతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

kalyan ram speech at ntr biopic audio launch
Author
Hyderabad, First Published Dec 21, 2018, 9:17 PM IST

నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో తెరకెక్కిన 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ జెఆర్సీ ఫంక్షన్హాల్ లో జరుగుతోంది. ఈ వేడుకకు నందమూరి కుటుంబంతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అభిమానుల సమక్షంలో అట్టహాసంగా వేడుకను నిర్వహించారు.

ఈ సందర్భంగా.. సినిమాలో హరికృష్ణ పాత్ర పోషించిన కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ''మూడు తరాలుగా మమ్మల్ని కాపాడుకుంటూ వస్తోన్న నందమూరి అభిమానులకు రుణపడి ఉంటాం. ఎన్టీఆర్ గారి గురించి చెప్పే వయసు నాకు.. ఆయన నుండి నేను నేర్చుకున్న విషయాలు.. కమిట్మెంట్, డెడికేషన్. ఆయనకు ఎంతో చేసిన తెలుగు వారికోసం ఎన్నో సేవలు చేశారు.

కిలో బియ్యం పథకం తెచ్చారు. ఆడవాళ్లకి ఆస్థిలో సమాన హక్కు కల్పించారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆయన మీద సినిమా తీయడమంటే మామూలు విషయం కాదు.. అది బాలయ్యకే సాధ్యం. ఎన్ బి కె ఫిల్మ్స్.. నందమూరి కుటుంబ సభ్యుల బ్యానర్. నాకు బాబాయ్ ఫోన్ చేసి నాన్నగారి హరికృష్ణ పాత్రలో నటిస్తావా అని అడగగానే ఆనందపడ్డాను.

ఇలాంటి సినిమాలో ఒక ఫ్రేమ్ లో కనిపిస్తే చాలు.. అలాంటిది నాకు మంచి పాత్ర దక్కింది. నేను ఎప్పుడూ నాన్నగారిలా ఉంటానని అనుకోను.. ఎందుకంటే నాన్నగారు దిట్టంగా ఉంటారు. నేను అలా ఉండను.. క్రిష్ గారు ఫోటోషూట్ చేసి బాగున్నారని అన్నారు. ఆ తరువాత బాబాయ్ దగ్గర నుండి కాల్ వచ్చింది. పాతికేళ్ల వయసున్న మా 
అన్నయ్యలా ఉన్నావని అన్నారు. ఇక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. 

రామారావు గారిని తెరపై చూపించాలంటే ఆరేడు సినిమాలు సరిపోవు. అలాంటి కథను క్లుప్తంగా అధ్బుతంగా తెరపై చూడబోతున్నారు. క్రిష్ లేకపోతే ఈ సినిమా ఇంత అధ్బుతంగా వచ్చి ఉండేది కాదు.. తన పనికి నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. కీరవాణి గారి సంగీతం అధ్బుతం. సాయి మాధవ్ గారి డైలాగ్స్ సినిమా స్థాయిని పెంచేశాయి'' అని వెల్లడించాడు. 

బాలయ్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేశారు.రెండు భాగాలుగా రూపొందిస్తున్న ఈ సినిమా ముందుగా 'కథానాయకుడు' రూపంలో జనవరి 9న విడుదల చేస్తుండగా, 'మహానాయకుడు' కథ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సంబంధిత వార్తలు.. 

ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

ఎన్టీఆర్ కి పోటీగా 'యాత్ర'.. తప్పు చేస్తున్నారా..?

బాలయ్య.. ఎన్టీఆర్ ని పిలుస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్.. చిన్న చేంజ్ ఏమిటంటే?

ఎన్టీఆర్ సినిమా సెట్ లో మోక్షజ్ఞ!

ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఆలస్యానికి కారణమిదేనా..?

ఎన్టీఆర్ లో తెలుగమ్మాయి.. ట్విస్ట్ లో దర్శనమిస్తుందట?

ఎన్టీఆర్ బయోపిక్.. ఆ తారలకు నో డైలాగ్స్!

షాకిచ్చే రేటుకు 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో రైట్స్

Follow Us:
Download App:
  • android
  • ios