Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ 3: తారక్ రెమ్యునరేషన్ ఫిక్స్?

 RRR కోసం దర్శకదీరుడు రాజమౌళి బల్క్ డేట్స్ తీసుకోవడంతో తారక్ వేరే పనులేమీ పెట్టుకోవడం లేదని ముందు నుంచి అయితే ఒక క్లారిటీ ఉంది. కానీ బిగ్ బాస్ యాజమాన్యం ఎలాగైనా సీజన్ 3కి తారక్ ని దింపాలని అనుకుంటోంది.

JR NTR REMUNERATION FOR BIG BOSS 3
Author
Hyderabad, First Published Feb 1, 2019, 3:53 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం ఎంతో ఆసక్తి రేపుతున్న బిగ్ బాస్ హోస్ట్ అంశంపై రోజుకో వార్త వైరల్ గా మారుతోంది. స్టార్ మా గాని.. అలాగే తారక్ నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. RRR కోసం దర్శకదీరుడు రాజమౌళి బల్క్ డేట్స్ తీసుకోవడంతో తారక్ వేరే పనులేమీ పెట్టుకోవడం లేదని ముందు నుంచి అయితే ఒక క్లారిటీ ఉంది. 

కానీ బిగ్ బాస్ యాజమాన్యం ఎలాగైనా సీజన్ 3కి తారక్ ని దింపాలని అనుకుంటోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే తారక్ కి ఇప్పుడు 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారానికి రెండు సార్లు వచ్చేలా డేట్స్ ఇస్తే చాలని స్టార్ మా తారక్ ముందు డబుల్ రెమ్యునరేషన్ ని ఉంచినట్లు తెలుస్తోంది. 

మొదటి ఎపిసోడ్ కి 14 కోట్ల వరకు ఇచ్చినట్లు అప్పట్లో టాక్. ఇక ఇప్పుడు తారక్ RRR వంటి భారీ ప్రాజెక్టులో ఉండడంతో రేంజ్ పెరిగింది.  అంతకంటే ఎక్కువగా అఫర్ చేయడంతో తారక్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దాదాపు తారక్ ని హోస్టింగ్ కి సైన్ చేయించే విధంగా బిగ్ బాస్ యూనిట్ సగం దూరం వచ్చినట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios