Asianet News TeluguAsianet News Telugu

'నాగబాబు బిక్ష తోనే...' శివాజీ రాజాకు 'హైపర్ ఆది' ఘాటు కౌంటర్

ఇది ఎలక్షన్ సీజన్. వాద ప్రతి వాదాల్లా ...నాయకులు వారి అనుచరులు, అభిమానులు కౌంటర్స్ ఇస్తున్నారు. 

Hyper Aadi Counter To Sivaji Raja's Comment Against Nagababu
Author
Hyderabad, First Published Apr 7, 2019, 6:55 PM IST

ఇది ఎలక్షన్ సీజన్. వాద ప్రతి వాదాల్లా ...నాయకులు వారి అనుచరులు, అభిమానులు కౌంటర్స్ ఇస్తున్నారు. నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న మెగా బ్రదర్ నాగబాబు కు ఎవరు ఓటు వేయొద్దని మాజీ మా అధ్యక్షుడు సినీ నటుడు శివాజీ రాజా  ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన  సంగతి తెలిసిందే.  పిల్లికి బిచ్చం కూడా వేయని నాగబాబుకు ఓటేస్తే ఓటు హక్కు వృధా అయినట్లే అని శివాజీరాజా కామెంట్స్ చేశారు. దీనికి నాగబాబు అభిమాని అయిన హైపర్ ఆది కౌంటర్ ఇచ్చారు.

హైపర్ ఆది మాట్లాడుతూ....శివాజీగారూ ..ఓ సీనియర్ ఆర్టిస్ట్ గా మీరంటే నాకు ఎంతో గౌరవం...కానీ నాగబాబు గురించి మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదు. మీరు అన్నారు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అని...కానీ నాగబాబుగారిని తిడితే చిరంజీవి గారికి నచ్చుతుందా..ఒక్కసారి ఆలోచించండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం అని చెప్పి..ఆయన ఎంపి అభ్యర్దిగా నిలబెట్టిన నాగబాబుగారికి ఓటేయద్దు అని మీరు చెప్తే... పవన్ కళ్యాణ్ గారికి నచ్చుతుందా..

మీరు చిరంజీవిగారిని, పవన్ కళ్యాణ్ గారిని పొగిడి నాగబాబు గారిని తిడితే మాలాంటి మెగా ఫ్యాన్స్ కు నచ్చుతుందా..నువ్వు రెండు సంవత్సరాలు మా అసోశియేషన్ లో ప్రెసిడెంట్ గా చేసావు...అది ఎవరి బిక్షం వేస్తే చేసావు  ఆ విషయం నీకు గుర్తు లేదా..బిల్లికి బిచ్చం వెయ్యిడా... జబర్దస్త్ లో ఓ ఆర్టిస్ట్ కు కిడ్నీ ఫెయిలైతే పది లక్షలు సహాయం చేసారు.మీకు ఆయన గురించి మీకేం తెలుసు అంటూ మీరు వెన్నుపోటు పొడిచారు నాగబాబు కు అంటూ హైపర్ ఆది ..ఓరేంజిలో కౌంటర్ ఇచ్చాడు.

Follow Us:
Download App:
  • android
  • ios