Asianet News TeluguAsianet News Telugu

చిన్న సినిమా.. హుషారైన హిట్!

టాలీవుడ్ లో చిన్న సినిమాలు అందుకుంటున్న విజయాల్ని చూసి నార్త్ మీడియా సైతం తెగ ఆశ్చర్యపోతోంది. పెద్దగా స్టార్స్ లేకపోయినా మౌత్ టాక్ తో విజయం అందుకోవచ్చని నిరూపిస్తున్నాయి మన సినిమాలు.

husharu big hit 50 days complete
Author
Hyderabad, First Published Feb 2, 2019, 10:58 AM IST

టాలీవుడ్ లో చిన్న సినిమాలు అందుకుంటున్న విజయాల్ని చూసి నార్త్ మీడియా సైతం తెగ ఆశ్చర్యపోతోంది. పెద్దగా స్టార్స్ లేకపోయినా మౌత్ టాక్ తో విజయం అందుకోవచ్చని నిరూపిస్తున్నాయి మన సినిమాలు. ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయకపోయినా కాస్త ఫన్ తో కూడిన కంటెంట్ ఉంటే చాలు పక్కన బడా స్టార్స్ సినిమాలున్నా పట్టించుకోరు. 

హుషారు సినిమా ఈ ఏడాది అందుకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అసలు ఈ సినిమా రిలీజ్ అయినట్లుగా మొదట్లో చాలా మందికి తెలియదు. అయితే చూస్తుండగానే మౌత్ టాక్ తో 50 రోజులను పూర్తి చేసుకోవడం గమనార్హం. స్టార్ సినిమాలే ఈ రోజుల్లో అర్ద సెంచరీ సాధించడం అంటే చాలా కష్టం. అలాంటిది రెండంకెల థియేటర్స్ లో సినిమా ఆఫ్ సెంచరీ కొట్టేసింది అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. 

సినిమాలో 'ఉండిపోరాదే' సాంగ్ యువతను ఎక్కువగా ఆకర్షించింది. కమెడియన్ రాహుల్ రామ కృష్ణ తప్పితే అందరూ కొత్తవాళ్లే అయినా సినిమాలో కంటెంట్ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యింది. శ్రీ హర్ష అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడం వల్ల షూటింగ్ పూర్తి చేయడానికి రెండేళ్లు పట్టింది. మొత్తానికి రిలీజ్ అయ్యి ఎంతో కొంత లాభాల్ని అందించింది.అదే విధంగా తెలుగు తమిళ్ లో కూడా సినిమా రీమేక్ కానుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios