Asianet News TeluguAsianet News Telugu

'అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు' ని కాపీ కొట్టేశారు!

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ కి స్పెషల్ గా ఎవరి స్టైల్ కి తగ్గట్టు వారు స్పెషల్ స్టెప్పులను క్రియేట్ చేసి కొన్ని వీడియోలను సిద్దం చేసే స్దాయిలో సెట్ అయ్యింది. ఫ్యాన్స్ ని అంతలా ఊపేసిన ఈ సాంగ్ వెండితెరపై క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ సాంగ్ ని మరోసారి గుర్తు చేసారు  ‘హౌస్‌ఫుల్ 4’ టీమ్.

Housefull 4 BGM Copy Of Ammadu Let's Do Kummudu Song
Author
Hyderabad, First Published Sep 28, 2019, 3:00 PM IST

మూవీ లవర్స్ మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ...'అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు '  మర్చిపోరు. చిరంజీవి కమ్ బ్యాక్ సినిమా గా వచ్చి, 2017 లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం ఖైదీ నెం 150. ఈ సినిమాకు సంగీతం ఎంత పెద్ద ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవి శ్రీ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు కుర్ర కారునే కాదు కదలలేని ముసలిని కూడా కాలు కదిపేలా చేసాయి.

ముఖ్యంగా అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ కి స్పెషల్ గా ఎవరి స్టైల్ కి తగ్గట్టు వారు స్పెషల్ స్టెప్పులను క్రియేట్ చేసి కొన్ని వీడియోలను సిద్దం చేసే స్దాయిలో సెట్ అయ్యింది. ఫ్యాన్స్ ని అంతలా ఊపేసిన ఈ సాంగ్ వెండితెరపై క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ సాంగ్ ని మరోసారి గుర్తు చేసారు  ‘హౌస్‌ఫుల్ 4’ టీమ్.

‘హౌస్‌ఫుల్ 4’ సినిమా ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గా ఈ ట్యూన్ వినిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సాంగ్ ని కాపీ కొట్టి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వటం ఓ విధంగా మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఈ విషయమై దేవిశ్రీ ప్రసాద్ ఎలా స్పందిస్తాడో తెలియదు కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన‌ చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’. ఫర్హాద్ సంఝీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌కు జోడీగా కృతిసనన్, రితేశ్ దేశ్‌ముఖ్‌కు జోడీగా పూజా హెగ్డే, బాబీ డియోల్‌కు జోడీగా కృతి కర్బంద నటించారు  అక్ష‌య్ కుమార్.. రాజకుమారుడు బాలా, హ్యారీ పాత్రల్లో నటించారు. 1419కి చెందిన రాజకుమారుడు బాలా.. 600 ఏళ్ల తర్వాత లండన్ నుంచి హ్యారీగా తిరిగి వస్తాడు.

చిత్రంలో కృతి సనన్ సీతమ్‌గఢ్‌ రాజకుమారి మధు పాత్రలో లండన్‌కు చెందిన కృతి పాత్రలో కన్పిస్తారు. రితేశ్ దేశ్‌ముఖ్ 1419కి చెందిన బంగ్డు అనే నాట్యకారుడి పాత్రతో పాటు రాయ్ అనే పాత్రలోనూ కనిపిస్తారు. ఈయనకు జోడీగా పూజా హెగ్డే నటించారు. ఆమె పాత్ర పేరు రాజకుమారి మాలా. 600 తర్వాత మళ్లీ పూజ పేరుతో పుడతారు. ఈ సినిమాలో మరో హీరో బాబీ డియోల్ కూడా ముఖ్య పాత్ర పోషించ‌గా, ఆయన పాత్ర పేరు ధర్మపుత్ర. ఆ తర్వాత ధరమ్‌ పేరుతో పుడతాడు. ఈయనకు జంటగా కృతి కర్బంద నటించారు. ఇందులో ఆమె పాత్ర పేరు రాజకుమారి మీన. ఆ తర్వాత నేహాగా పుడతారు.

హౌస్‌ఫుల్ ఫ్రాంచైస్‌లో రాబోతున్న నాలుగో చిత్రంకి సంబంధించిన ట్రైలర్ లోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కి ఆస‌క్తి క‌లిగిస్తుున్నాయి. పునర్జమ్మల నేపథ్యంలో 1419, 2019 మధ్య కాలంలో సాగే ఈ కథలో బోలెడంత ఫన్  ఉంటుందని అంటున్నారు. దీపావళి కానుకగా అక్టోబ‌ర్ 25న‌ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios