Asianet News TeluguAsianet News Telugu

అంతరిక్షంలో తొలిసారి స్టార్ వార్స్ సినిమా ప్రదర్శన

  • స్టార్ వార్స్ సిరీస్ లో తాజాగా వస్తోన్న స్టార్ వార్స్:ది లాస్ట్ జెడి
  • ఈ మూవీని స్పేష్ స్టేషన్ వ్యోమగాములకు పంపనున్నట్లు తెలిపిన నాసా
  • డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ మూవీ
hollywood movie screening in space station

 

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న హాలీవుడ్ సిరీస్ ‘స్టార్‌వార్స్‌’ లో తాజాగా వస్తున్న ఎనిమిదో చిత్రం ‘ది స్టార్‌వార్స్‌: ది లాస్ట్‌ జేడీ’. డిసెంబరు 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది.

 

ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌(ఐఎస్‌ఎస్‌)లో ఉన్న వ్యోమగాముల కోసం అతి త్వరలో నాసా ఈ చిత్రాన్ని ప్రదర్శించనుందట. ‘ప్రస్తుతం అంతరిక్ష కక్ష్యలో ఉన్న వ్యోమగాములు ఈ సినిమాను కచ్చితంగా చూస్తారు’ అని నాసా ప్రజా సంబంధాల అధికారి డ్యాన్‌ హ్యుయో తెలిపారు. అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు డిజిటల్‌ ఫైల్స్‌ రూపంలో సినిమాలు పంపుతారు. అక్కడే ఉండే ప్రొజెక్టర్‌ లేదా ల్యాప్‌టాప్‌పై వారు సినిమాలు చూడాల్సి ఉంటుంది. ఐఎస్‌ఎస్‌లో ఉన్న స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్‌ క్యాప్సుల్‌ ద్వారా సినిమా పంపడం సులువేనని ది ఇన్వర్స్‌ తెలిపింది.

 

ఐఎస్‌ఎస్‌లో సినిమాలను ఆస్వాదించటం కొంత ఇబ్బందికరమేనని ది వర్జ్‌ పేర్కొంది. స్పేస్‌స్టేషన్‌లో విశాలమైన డిజిటల్‌ లైబ్రరీ ఉంది. 500లకు పైగా వీడియోలు అందులో ఉన్నాయి. వాటిలో పలు క్లాసిక్స్‌తో పాటు, కొత్త సినిమాలు కూడా ఉన్నాయి.

 

కాగా ‘స్టార్‌వార్స్‌’ సిరీస్‌లో వస్తున్న తాజా చిత్రం ‘ది లాస్ట్‌ జేడీ’. రియాన్‌ జాన్సన్‌ దర్శకుడు. మార్క్‌ హామిల్‌, కెర్రీ ఫిషర్‌, ఆడమ్‌ డ్రైవర్‌, డైసీ రిడ్లే, జాన్‌ బొయేగా, ఆస్కార్‌ ఇసాక్‌, ఆండీ సెర్కిస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కేథలీన్‌ కెన్నడీ, రామ్‌ బెర్గ్‌మ్యాన్‌లు నిర్మించారు. డీస్నీ స్టూడియోస్‌ మోషన్‌ పిక్చర్‌ డిస్ట్రిబ్యూట్‌ చేస్తోంది.

 
Follow Us:
Download App:
  • android
  • ios