Asianet News TeluguAsianet News Telugu

హైకోర్టులో సైరా: అమితాబ్ పేరు అవసరం లేదు!

సైరా నరసింహారెడ్డి సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తమ వారసుడి ఆధారంగా తెరకెక్కిన ఆ కథను తమకు తప్పకుండా ఒకసారి చూపించాలని చరిత్రను వక్రీకరించేలా సినిమా తీస్తే ఒప్పుకోమని  ఎలా తీశారో మేము చూసి నిర్దారిస్తామని ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు హై కోర్టును ఆశ్రయించారు. 

high court about amitabh bachan name in sye raa issue
Author
Hyderabad, First Published Sep 26, 2019, 9:24 AM IST

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తమ వారసుడి ఆధారంగా తెరకెక్కిన ఆ కథను తమకు తప్పకుండా ఒకసారి చూపించాలని చరిత్రను వక్రీకరించేలా సినిమా తీస్తే ఒప్పుకోమని  ఎలా తీశారో మేము చూసి నిర్దారిస్తామని ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు హై కోర్టును ఆశ్రయించారు. 

అయితే పిటిషన్ లో చిత్ర యూనిట్ తో పాటు అమితాబ్ బచ్చన్ పేరును కూడా ప్రస్తావించడంతో కోర్టు అందుకు తీరస్కరించింది. వెంటనే ఆ పేరును ప్రతివాదుల లిస్ట్‌ నుంచి తీసేయాలని కేసుపై తుది విచారణను గురువారానికి వాయిదా వేశారు. ఇక ఉయ్యాలవాడ కుటుంబానికి చెందిన 22 మందికి సినిమాను చూపించిన తరువాతే సినిమాను రిలీజ్ చేయాల్సిందిగా కుటుంబ సభ్యుల తరపు న్యాయవాది వాదించారు. 

ఇక రామ్ చరణ్ తరపు న్యాయవాది వాదిస్తూ.. ఒక చారిత్రాత్మక సంఘటనల ఆధారంగా సినిమా తీసేందుకు ఎవరి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అక్టోబర్ 2న విడుదల కానున్న సైరా సెన్సార్ పనులు రీసెంట్ గా ముగిశాయి. సెన్సార్ బోర్డు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios