store bannerentertainment
By asianet news Telugu Team | 09:52 AM March 18, 2017
పూరీ జగన్ కు అసలు తెలుగు వాళ్లంటే ఇష్టంలేదట..హేమ చెప్తోంది

Highlights

  • పరిశ్రమలో అంతా ఒకేలా ఉండరంటున్న హేమ.. మంచానికి  హీరోయిన్ ఆఫర్
  • పూరీ జగన్ కు అసలు తెలుగు వాళ్లంటే ఇష్టంలేదట..
  • ఇష్టముంటే తెలుగు పడుచునైన నాకు మంచి అవకాశమెందుకివ్వడని ప్రశ్న
  •  

తెలుగులో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ. రెండేళ్ల క్రితం జరిగిన ‘మా’ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించి మరింత పాపులర్‌ అయింది. తాజాగా ఓ వెబ్‌మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన హేమ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగు సినీ పరిశ్రమపై కొంతమంది హీరోయిన్లు చేసిన విమర్శల గురించి, సోషల్‌ మీడియా గురించి ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా పూరీ జగన్నాథ్‌ గురించి చాలా మాట్లాడేసింది.

 

తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు వాళ్లకు అసలు అవకాశాలు దక్కడం లేదన్న హేమ... దర్శకుడు పూరీ జగన్నాథ్‌  ఎక్కడి వాళ్లనో తీసుకొచ్చి అవకాశాలు ఇస్తాడని., ఇక్కడి వాళ్లనెందుకు తీసుకోడో అర్థం కావట్లేదని వాపోయింది. పూరీ నాకెందుకు మదర్‌ క్యారెక్టర్స్‌ ఇవ్వడని, ఎన్టీయార్‌కు తల్లిగా కనిపించే స్టేచర్‌ నాకు లేదా? నాకు సినీ పరిశ్రమలో 25 ఏళ్ల అనుభవం ఉంది. ఏదైనా చెప్పే అర్హత, హక్కు నాకుంది.అంటూ రెచ్చిపోయింది హేమ.

 

‘కాస్టింగ్‌ కౌచ్‌’ సంస్కృతి గురించి ఇటీవల మాట్లాడిన పలువురు నటీమణులపై హేమ విరుచుకుపడింది. ఆరోపణలు చేసిన వాళ్లు గత సినిమాల పేర్లు చెప్పుకునే బతుకుతున్నారని, ఇప్పుడు అవకాశాలు రానంత మాత్రన విమర్శలు చేయడం సరికాదని హేమ సూచించింది. నిజంగా ఇండస్ట్రీ అంత చెడ్డదైతే.. పెద్ద పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ పిల్లలను ఎందుకు పరిశ్రమలోకి తీసుకువస్తున్నారని ప్రశ్నించింది. ఇక, సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత చాలా అనర్థాలు జరుగుతున్నాయంది హేమ.

Show Full Article


Recommended


bottom right ad