Asianet News TeluguAsianet News Telugu

సిల్వర్ స్క్రీన్ పై గాంధీతాత.. ఎందరికో స్ఫూర్తి!

అహింసే ఆయుధంగా చేసుకొని పోరాటం సాగించి బ్రిటీష్ వాళ్లను వెళ్లగొట్టి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గురించి ఎంత చెప్పినా తక్కువ. 

Gandhi Jayanti special
Author
Hyderabad, First Published Oct 2, 2019, 1:16 PM IST

అహింసే ఆయుధంగా చేసుకొని పోరాటం సాగించి బ్రిటీష్ వాళ్లను వెళ్లగొట్టి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గురించి ఎంత చెప్పినా తక్కువ. ఆయన గురించి మాటల్లో వర్ణించడం అంత సులభమైన విషయం కాదు. అందుకే ఆయనకి సంబంధించిన విషయాలను బలమైన మీడియా సినిమా ద్వారా అనేక సార్లు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈరోజు 150వ గాంధీ జయంతి సందర్భంగా ఆయన కథతో, ఆయన జీవితం స్ఫూర్తితో తెరకెక్కిన సినిమా విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

1982లో ఇంగ్లాండ్‌లో పుట్టిపెరిగిన రిచర్డ్ అటెన్‌బరో అనే ఫిల్మ్ మేకర్'గాంధీ' సినిమా తీశారు. ఆ సినిమాను ఇంగ్లాండ్ లో కూడా రిలీజ్ చేశారు. అక్కడ కూడా సినిమా పెద్ద హిట్ అయింది. 

అలానే మరో దర్శకుడు శ్యామ్ బెనెగల్ 'ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మ' అనే సినిమా రూపొందించాడు. ఈ సినిమాలో గాంధీజీ స్వభావం అలా రూపుదిద్దుకోవడానికి మూలం ఏంటి..? ఆయన ప్రస్తానం ఎలా మొదలైందనే విషయాలను చూపించారు. 

బాలీవుడ్ లో  'లగేరహో మున్నాభాయ్' సినిమాలో ఒక మాములు దాదా కూడా గాంధీగిరికి తలొగ్గి మంచివాడిగా ఎలా మారతాడో చూపించారు. ఇదే సినిమాను తెలుగులో 'శంకర్ దాదా జిందాబాద్' పేరుతో రీమేక్ చేశారు. 

ఇక శ్రీకాంత్ తన వండవ సినిమాగా 'మహాత్మ'ని తెరకెక్కించాడు. ఆ సినిమాలో కూడా ఒక బస్తి రౌడీ జీవితాన్ని మహాత్ముడి గుణాలు, ఆలోచనలు ఎలా మార్చాయనేది చూపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios