Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. ఎందుకు చూడాలంటే..?

నందమూరి అభిమానులతో పాటు ప్రపంచం మొత్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న చిత్రం 'ఎన్టీఆర్' బయోపిక్. మహానటుడు దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రను రెండు భాగాలుగా చిత్రీకరించారు. 

five reasons to watch ntr biopic
Author
Hyderabad, First Published Jan 9, 2019, 11:09 AM IST

నందమూరి అభిమానులతో పాటు ప్రపంచం మొత్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న చిత్రం 'ఎన్టీఆర్' బయోపిక్. మహానటుడు దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రను రెండు భాగాలుగా చిత్రీకరించారు. మొదటి భాగం ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐదు దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీని ఏలిన మహానుభావుడి చరిత్రను చూడడానికి ప్రత్యేకంగా కారణాలు ఏవీ అక్కర్లేదు కానీ అభిమానుల కోసం ఐదు కారణాలను చెప్పాలనుకుంటున్నాం.. 

మరోసారి తెరపై ఎన్టీఆర్..

1949లో కెరీర్ ఆరంభించిన ఎన్టీఆర్ 1993 వరకు నటిస్తూనే ఉన్నారు. ఆ తరువాత ఆయన్ని తెరపై చూసే అవకాశం రాలేదు. ఇప్పుడు ఆయన పాత్రలో అతడి కొడుకు బాలకృష్ణ నటించడం విశేషమనే చెప్పాలి. తన కెరీర్ పరంగా మాస్ కమర్షియల్ సినిమాలు చేసే బాలకృష్ణ తొలిసారి తన పంథా మార్చుకొని తండ్రి బయోపిక్ చేయాలనుకున్నాడు. తను నటించి నిర్మించిన సినిమా ఇది. తెరపై బాలకృష్ణని చూసిన వారు ఎన్టీఆర్ ని చూసిన అనుభూతి కలుగుతుందని అంటున్నారు. సినిమా ట్రైలర్ ని బట్టి బాలయ్య తండ్రి పాత్రలో ఎంతగా ఇమిడిపోయాడో అర్ధమైంది. అలాంటిది తెరపై మూడు గంటల పాటు సినిమాను చూసిన అభిమానులు ఎన్టీఆర్ ని మరోసారి తెరపై చూస్తున్నామని సంతోషంలో మునిగిపోయారు. ఇప్పటివరకు బాలయ్యలో చూడని కోణం అభిమానులు ఈ సినిమాలో చూస్తారు. 

క్రిష్ డైరెక్షన్.. 

'గమ్యం' సినిమాతో పదేళ్ల క్రితం టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు క్రిష్ 'వేదం', 'కంచె', 'గౌతమీ పుత్ర శాతకర్ణి' ఇలా ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను డైరెక్ట్ చేశాడు. కథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా చెప్పడంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి ఉంది. సరికొత్త కథలను ఎన్నుకొని స్క్రీన్ ప్లే తో మాయ చేసే క్రిష్ ఈ సినిమాను కూడా అదే విధంగా రూపొందించాడు. తనపై పెట్టుకున్న నమ్మకానికి పూర్తి న్యాయం చేశాడు క్రిష్. తేజ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో క్రిష్ ని సెలెక్ట్ చేసుకొని మంచి నిర్ణయం తీసుకున్నారని అప్రిషియేట్ చేస్తున్నారు. 

ముఖ్యపాత్రల్లో అగ్రనటీనటులు.. 

ఎన్టీఆర్ బయోపిక్ తీయాలనే ఆలోచన వచ్చినప్పుడు థియేటర్ ఆర్టిస్ట్ లతో సినిమా చేయాలనుకున్నారు. కానీ క్రిష్ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయిన తరువాత ప్రాజెక్ట్ కాన్వాస్ పెంచడానికి అగ్ర నటీనటులను రంగంలోకి దింపాడు. ఎన్టీఆర్ పాత్రని బాలకృష్ణ చేస్తుండగా.. నందమూరి హరికృష్ణ పాత్ర కోసం ఆయన కుమారుడు హీరో కళ్యాణ్ రామ్ ని తీసుకున్నారు. బసవతారకం పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ని తీసుకున్నారు. చంద్రబాబు నాయుడిగా రానా, శ్రీదేవిగా రకుల్, ఏఎన్నార్ గా సుమంత్ లతో పాటు హన్సిక, పాయల్ రాజ్ పుత్, శాలిని వంటి నటీమణులు ముఖ్య పాత్రలు పోషించారు. ఒక సినిమాలో ఇంతమంది తారలను చూడడం అభిమానులకు కన్నులవిందనే చెప్పాలి. 

ఎం.ఎం.కీరవాణి సంగీతం.. 

అన్నమయ్య, మగధీర, ఈగ, బాహుబలి ఇలా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలకు అధ్బుతమైన సంగీతం అందించిన సంగీత దర్శకుడు కీరవాణి ఈ బయోపిక్ కి కూడా స్వరాలు సమకూర్చాడు. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ ఆడియో పెద్ద హిట్ అయింది. ఎప్పుడైతే చిత్రబృందం 'కథానాయక' పాటను విడుదల చేసిందో.. అప్పటినుండే ఈ పాటలను తెరపై 
చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. తెరపై కీరవాణి సంగీతం మ్యాజిక్ చేసిందని చెబుతున్నారు. కైలాష్ ఖేర్, కాల భైరవ, చిత్ర, శ్రీనిధి, సునీత ఇలా ఎంతో మంచి గాయకులు తమ గాత్రంతో మెప్పించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం మరో ఎత్తు. నేపధ్య సంగీతం సినిమా స్థాయిని పెంచిందనే చెప్పాలి. 

సరికొత్త అనుభూతి.. 

ఒకప్పుడు ఎన్టీఆర్ నటించిన సన్నివేశాలను, పాటలను రీక్రియేట్ చేసి చూపించడమనేది అభిమానులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. సినిమా పోస్టర్లు చూసుకుంటూనే ఆనందపడిపోయిన అభిమానులు తెరపై ఎన్టీఆర్ నటించిన సన్నివేశాలను మరోసారి చూసుకొని మురిసిపోతున్నారు. భారీ సెట్లు, అధ్బుతమైన కాస్ట్యూమ్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. సినిమాలో దివిసీమ ఎపిసోడ్ చూసిన తరువాత అభిమానులు ఆశ్చర్యపోవడం ఖాయం.    

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

Follow Us:
Download App:
  • android
  • ios