Asianet News TeluguAsianet News Telugu

బెడ్ రూమ్ పిక్ షేర్ చేసిన ప్రియాంక.. మండిపడుతున్న ఫ్యాన్స్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గతేడాది డిసంబర్ లో హాలీవుడ్ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

fans fires on priyanka chopra
Author
Hyderabad, First Published Feb 4, 2019, 4:38 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గతేడాది డిసంబర్ లో హాలీవుడ్ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయ్ పూర్ లో వీరి వివాహం ఎంతో గ్రాండ్ గా జరిగింది. కొన్ని చోట్ల ఈ జంట రిసెప్షన్ లు కూడా ఇచ్చింది. 

ఇప్పటివరకు పెళ్లి, రిసెప్షన్ అంటూ బిజీగా గడిపిన ఈ జంట ఇప్పుడు కాలిఫోర్నియాలో కాపురముంటున్నారు. ఈ క్రమంలో తన భర్త, కుటుంబంతో కలిసి తీసుకుంటున్న కొన్ని ఫోటోలను ప్రియాంక సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. 

తాజాగా ఆమె తన భర్త నిక్ తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసిన 'హోం' అనే క్యాప్షన్ ఇచ్చింది. బెడ్ రూమ్ లో భర్తతో తీసుకున్న ఫోటోని షేర్ చేయడంతో ప్రియాంకపై మండిపడుతున్నారు నెటిజన్లు. మరీ ఇంత ఓవర్ ప్రచారం అవసరమా..? అంటూ ప్రియాంకని ప్రశ్నిస్తున్నారు. 

మరికొందరు కాస్త ప్రైవసీ మైంటైన్ చేయండని సలహాలు ఇస్తున్నారు. బెడ్ రూమ్ లో కూడా ఫోటోగ్రాఫర్ ని పెట్టుకున్నారా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Home 😍

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Feb 3, 2019 at 8:25pm PST

Follow Us:
Download App:
  • android
  • ios