Asianet News TeluguAsianet News Telugu

క్రికెటర్ గా మహేష్ బాబు!

సూపర్ స్టార్ మహేష్ బాబుని వెండితెరపై క్రికెటర్ గా చూడబోతున్నామా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా 'మహర్షి' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

cricket episode in mahesh babu 'maharshi' movie
Author
Hyderabad, First Published Jan 30, 2019, 4:19 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబుని వెండితెరపై క్రికెటర్ గా చూడబోతున్నామా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా 'మహర్షి' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా మహేష్ బాబు పలు వేరియేషన్స్ ఉన్న పాత్ర పోషించబోతున్నాడు. సినిమాలో మహేష్ బాబు కాసేపు క్రికెటర్ గా కనిపిస్తాడని సమాచారం. బ్యాట్ పట్టుకొని మైదానంలో క్రికెట్ ఆడుతూ కనిపిస్తాడట. దీనికి సంబంధించిన సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

మహేష్ క్రికెట్ ఆడే సన్నివేశాలు తెరపై అభిమానులను మరింత ఖుషీ చేస్తాయని అంటున్నారు. గతంలో 'ఒక్కడు' సినిమాలో మహేష్ కబడ్డీ ఆడుతూ కనిపించాడు. ఆ తరువాత క్రీడాకారుడిగా మరే సినిమాలో కనిపించలేదు. మళ్లీ ఇంతకాలానికి 'మహర్షి'లో క్రికెటర్ గా కొంతసేపు కనిపించనున్నాడు.

మరి ఈ లుక్ కి సంబంధించిన ఫోటోలు ఏమైనా నిర్మాతలు విడుదల చేస్తారేమో చూడాలి. దిల్ రాజు, అశ్వనీదత్, పివిపి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు!

Follow Us:
Download App:
  • android
  • ios