Asianet News TeluguAsianet News Telugu

వర్మ 'వెన్నుపోటు' పాటపై వివాదం!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. దివంగత ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తరువాత ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే అంశాలతో సినిమాను రూపొందించనున్నారు.

controversy on lakshmies ntr movie vennupotu song
Author
Hyderabad, First Published Dec 22, 2018, 1:19 PM IST

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. దివంగత ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తరువాత ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే అంశాలతో సినిమాను రూపొందించనున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన 'వెన్నుపోటు' పాటపై వివాదం చెలరేగుతోంది. నిన్న 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా ఆడియో విడుదల కావడంతో వర్మ దానికి కౌంటర్ గా తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో 'వెన్నుపోటు' పాటని విడుదల చేశారు.

విడుదల చేసిన కొద్దిసేపటికే ఈ పాట వైరల్ అయింది. ఎన్టీఆర్ ని చంద్రబాబు మోసం చేసి వెన్నుపోటు పొడిచారని పాట రూపంలో వెల్లడించారు. దీంతో టీడీపీ నేతలు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మపై మండిపడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా వర్మ వ్యవహరించారని ఆయనపై పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేస్తున్నారు.

వర్మ వెనుక ఉన్న కుట్రదారులెవరో తేలాలని నినాదాలు చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా వర్మపై టీడీపీ నేతలు కేసులు పెడుతున్నారు. కర్నూలు పీఎస్ లో ఎమ్మెల్యే మోహన్ రెడ్డి.. వర్మపై కేసు పెట్టి అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి!

ఇవి కూడా చదవండి.. 

'లక్ష్మీస్ ఎన్టీఆర్': ఆర్జీవీ వెన్నుపోటు..!

ఒరేయ్ ఆర్జీవీ.. బాలయ్య వాయిస్ కి వర్మ రిప్లై!

లక్ష్మీపార్వతి కారణంగానే ఎన్టీఆర్ చనిపోయారు.. వర్మ సంచలన కామెంట్స్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ఎపిసోడ్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?

లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!

ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!

Follow Us:
Download App:
  • android
  • ios