Asianet News TeluguAsianet News Telugu

2018: 170 సినిమాల్లో 15 హిట్లు.. ఇదీ సక్సెస్ రేట్!

ప్రతీ ఏడాదిలానే ఈసారి కూడా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఏమాత్రం పెరగలేదని తెలుస్తోంది. ఈ ఏడాది మొత్తంగా చూసుకుంటే విడుదలైన సినిమా 170. 

Cinema industry success rate in 2018
Author
Hyderabad, First Published Dec 31, 2018, 3:47 PM IST

ప్రతీ ఏడాదిలానే ఈసారి కూడా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఏమాత్రం పెరగలేదని తెలుస్తోంది. ఈ ఏడాది మొత్తంగా చూసుకుంటే విడుదలైన సినిమా 170. మరి అందులో ఎన్ని సక్సెస్ లు అందుకొని నిర్మాతలకు లాభాలు తీసుకోచ్చాయా..? అని చూస్తే కేవలం 15 సినిమాలు మాత్రమే లెక్కకు వస్తున్నాయి. అంటే సక్సెస్ రేట్ పది శాతం మాత్రమే..

'జై సింహా', 'భాగమతి', 'ఛలో', 'గీత గోవిందం', 'రంగస్థలం', 'భరత్ అనే నేను', 'మహానటి', 'తొలిప్రేమ', 'ఆర్ ఎక్స్ 100', 'గూఢ‌చారి', 'టాక్సీవాలా' వంటి చిత్రాలు నిర్మాతలకు లాభాలు తీసుకొస్తే.. మరికొన్ని సినిమాలు జయానికి, అపజయానికి మధ్య దోబూచులాడుతూ.. అటు, ఇటు కాకుండా అయిపోయాయి. 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆ రేంజ్ లో ఈ సినిమా పర్‌ఫార్మ్‌ చేయకపోయినా.. ఎన్టీఆర్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. రామ్ నటించిన 'హలో గురు ప్రేమకోసమే' సినిమా దసరా సీజన్ ని అడ్వాంటేజ్ గా తీసుకుంది. నాగచైతన్య 'శైలజారెడ్డి అల్లుడు' సినిమా మారుతి బ్రాండ్ వాల్యూతో ఫ్లాప్ అయితే తప్పించుకోగలిగింది. చిన్న  చిత్రాలు 'సమ్మోహనం', 'నీది నాది ఒకే కథ', 'చిలసౌ', ఈ నగరానికి ఏమైంది' లాంటి సినిమాలకి ఓ రకమైన ప్రోత్సాహం లభించింది.

డబ్బింగ్ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాదిలో 'అభిమన్యుడు', 'సర్కార్', 'పందెంకోడి2', 'విశ్వరూపం2', 'గ్యాంగ్', 'నవాబ్', '2.0', 'చినబాబు', 'కెజిఎఫ్' ఇలా వీటి లిస్టు కూడా కాస్త పెద్దదిగానే ఉన్నా.. రజినీకాంత్ '2.0', 'కెజిఎఫ్'లకు హిట్ టాక్ వచ్చింది. 'అభిమన్యుడు', 'నవాబ్' వంటి చిత్రాలు ఫ్లాప్ టాక్ నుండి తప్పించుకున్నాయి. ఇండస్ట్రీలో అధిక శాతం సక్సెస్ రేట్ లేకపోవడానికి మొదటి కారణం మార్కెట్ స్థాయికి మించి డబ్బుని ఖర్చు పెట్టడమనే చెప్పాలి. ఈ కారణంతోనే చాలా సినిమాలు హిట్ అయినా.. నిర్మాతలకు లాభాలను మాత్రం తీసుకురాలేకపోయాయి. 

మరో విషయమేమిటంటే.. ఒక సినిమా గనుక హిట్ అయితే ఇక అదే లైన్ తో గంపల కొద్దీ సినిమాలు వచ్చి పడతాయి. 'ఆర్ఎక్స్ 100' సినిమాను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఇదే లైన్ తో పదుల సంఖ్యలో సినిమాలను రూపొందించారు. వాటిలో సగం సినిమాలు రిలీజ్ కి కూడా నోచుకోవు. వారానికి మూడు, నాలుగు సినిమాలు  బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయితే అది కచ్చితంగా సినిమాలకు పెద్ద దెబ్బనే చెప్పాలి..

ఒకవేళ సినిమా బాగున్నా.. ఆ గుంపులో కొట్టుకుపోతాయి. నిర్మాతలు ఈగోలను పక్కన పెట్టి విడుదల తేదీ విషయంలో రాజీ పడితే తప్ప మరో మార్గం కనిపించడం లేదు. సినిమాలు చేయాలని ఇండస్ట్రీకి వచ్చిన చాలా మంది కొత్త నిర్మాతలు ఫ్లాప్ లకు భయపడి ఇండస్ట్రీ నుండి వెళ్లిపోయిన లిస్ట్ కూడా బాగానే ఉంది. చాలా మంది అగ్ర నిర్మాతలు వేరే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు. వచ్చే ఏడాదైనా.. సినిమా సక్సెస్ రేట్ పెరుగుతుందేమో చూద్దాం!

2018: హీరో ఆఫ్ ది ఇయర్.. మెగాపవర్ స్టార్! 

2018: ఈ ఏడాది ఫ్లాప్ హీరో కిరీటం ఇతడికే..

2018: ఈ ఏడాది చెత్త సినిమాలు ఇవే..

2018: చిన్న చిత్రాలు.. కోట్లలో లాభాలు!

2018 లో కనిపించని హీరోలు వీళ్లే..!

 

Follow Us:
Download App:
  • android
  • ios