Asianet News TeluguAsianet News Telugu

కార్తీ విజయ్ లకు దివాళి బాక్స్ ఆఫీస్ అఫర్!

విజయ్ - కార్తీ వారి సినిమాలతోఈ సారి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తున్నారు. 180కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన బిగిల్ సినిమా ఈ నెల 25న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అదే రోజు కార్తీ కూడా రానున్నాడు. విజయ్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కిన బిగిల్ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి

Bigil and Khaidi get a huge boost from deepavali festival
Author
Hyderabad, First Published Oct 22, 2019, 8:13 AM IST

తమిళ చిత్ర పరిశ్రమలో  ఈ దీపావళికి హడావుడి గట్టిగా కనిపించేలా ఉంది. విజయ్ - కార్తీ వారి సినిమాలతోఈ సారి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తున్నారు. 180కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన బిగిల్ సినిమా ఈ నెల 25న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అదే రోజు కార్తీ కూడా రానున్నాడు. విజయ్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కిన బిగిల్ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన కోలీవుడ్ ఇండస్ట్రీలో పాత రికార్డులు బద్దలవ్వడం పక్కా.  అలాగే కార్తీ కూడా డిఫరెంట్ జానర్ లో రొమాన్స్ సాంగ్స్ లేకుండా ఖైదీ సినిమాతో ప్రయోగం చేస్తున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే..  తమిళనాడు ప్రభుత్వం సోమవారం తమిళ ప్రజలకు హాలిడే ప్రకటించింది. అంటే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ రెండు సినిమాలకు వరుసగా నాలుగు రోజులు బాక్స్ ఆఫీస్ పండగే అని చెప్పాలి.

సోమవారం వరకు దొరికినంత కలెక్షన్స్ దోచుకోవచ్చు.  ఇక కోలీవుడ్ లో బిగిల్ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో గాని తెలుగులో మాత్రం విజయ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ని అందించేలా ఉంది. తెలుగులో బిగిల్ విజిల్ పేరుతో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా విజయ్ సినిమా తెలుగు మార్కర్ లో భారీగా రిలీజ్ కాబోతోంది.

ఎపి తెలంగాణాలో మొత్తంగా 675స్క్రీన్న్ లలో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఒక నైజాంలోనే  విజిల్ 275స్క్రీన్స్ లలో ప్రదర్శించనున్నారు. గతంలో విజయ్ తుపాకీ - సర్కార్ సినిమాలకు మంచి టాక్ వచ్చినప్పటికి ఈ స్థాయిలో ఏ ఆ సినిమాలు విడుదల కాలేదు. ఇక ఇప్పుడు వాటికంటే ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవుతుండడంతో విజయ్ సినిమా తెలుగులో మంచి ఓపెనింగ్స్ ని రాబట్టే అవకాశం ఉంది. తెలుగులో సినిమాను మహేష్ కోనేరు విడుదల చేస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్. రెహమాన్ సంగీతం అందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios