Asianet News TeluguAsianet News Telugu

వెంకీ నీకు అవసరమా..? ఫ్యాన్స్ వార్నింగ్

గత కొద్దిరోజులుగా బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా సీనియర్ హీరో వెంకటేష్ వ్యవహరించనున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు విన్న వెంకీ అభిమానులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్నారు

bigg boss3: fans warning to venkatesh
Author
Hyderabad, First Published Jan 2, 2019, 4:58 PM IST

గత కొద్దిరోజులుగా బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా సీనియర్ హీరో వెంకటేష్ వ్యవహరించనున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు విన్న వెంకీ అభిమానులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాద్వారా వ్యక్తపరుస్తున్నారు.

కొందరు బిగ్ బాస్ షో చేయొద్దని అంటుంటే మరికొందరు మాత్రం కచ్చితంగా చేయాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ షో ద్వారా వెంకీకి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరుగుతుందని, టీవీ ఆడియన్స్ లో కూడా అతడికి ఫ్యాన్ బేస్ పెరుగుతుందని ఓ వర్గం వాదిస్తుంటే, మరో వర్గం మాత్రం దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు ఎలాంటి వివాదాల జోలికి పోకుండా సైలెంట్ గా ఉంటోన్న వెంకీ ఈ షో చేస్తే గనుక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. నాని కూడా ఓ సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించి అనవసరంగా కొంత బ్యాడ్ అయ్యాడని, అది ఆయన సినిమాలపై కూడా ఎఫెక్ట్ చూపించిందని.. వెంకీకి అటువంటి పరిస్థితి ఎక్కడ వస్తుందా అని ఆందోళన చెందుతున్నారు.

కొందరైతే వెంకీని ఈ షో చేయొద్దని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ షో నిర్వాహకులు మాత్రం వెంకటేష్ తో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. డీల్ కుదిరిన తరువాత అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్ లో ఈ షో మొదలు కానుంది. 

బిగ్ బాస్3: ఆ సీనియర్ హీరో ఒప్పుకుంటాడా..?

 

Follow Us:
Download App:
  • android
  • ios