Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్3: ఆ సీనియర్ హీరో ఒప్పుకుంటాడా..?

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే తెలుగులో రెండు సీజన్స్ ని పూర్తి చేసుకుంది. ఈ రెండు సీజన్లకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సదరు చానెల్ టీఆర్పీ రేటింగ్స్ ఓ రేంజ్ లో వచ్చాయి. 

Bigg Boss 3 : Sr Telugu Hero Approched!
Author
Hyderabad, First Published Jan 1, 2019, 12:34 PM IST

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే తెలుగులో రెండు సీజన్స్ ని పూర్తి చేసుకుంది. ఈ రెండు సీజన్లకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సదరు చానెల్ టీఆర్పీ రేటింగ్స్ ఓ రేంజ్ లో వచ్చాయి.

బిగ్ బాస్ సీజన్ 1 కంటే సీజన్ 2 మరింత పాపులారిటీ దక్కించుకుంది. మొదటి సీజన్ కి హోస్ట్ గా ఎన్టీఆర్ పని చేయగా, రెండో సీజన్ కి హీరో నాని పని చేశారు. హోస్ట్ గా నానిపై ఎన్నో కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కౌశల్ ఆర్మీ నానికి సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేసింది.

దీంతో నాని తదుపరి సీజన్ కి హోస్ట్ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. బిజీ షెడ్యూల్స్ కారణంగా తను తదుపరి సీజన్లకు హోస్ట్ చేయడంలేదని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు మూడో సీజన్ కి హోస్ట్ గా ఎవరు వ్యవహరించబోతున్నారనే విషయంపై సీనియర్ హీరో వెంకటేష్ పేరు బాగా వినిపిస్తోంది. ఇటీవల ఛానల్ యాజమాన్యం వెంకటేష్ ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.

టీవీ షోలకు దూరంగా ఉండే వెంకీ ఈ షోకి ఫ్రెష్ నెస్ ని తీసుకురావడం ఖాయం. ఇప్పటివరకు ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో, టాక్ షోలలో పాల్గొన్నారే తప్ప హోస్ట్ గా ఏ షోకి పని చేయలేదు. బిగ్ బాస్ షో గనుక అంగీకరిస్తే.. ఆయన బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరవ్వడం ఖాయం. ఈ ఏడాది జూన్ నెల నుండి బిగ్ బాస్ షో మొదలుకానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios