Asianet News TeluguAsianet News Telugu

అర్జున్ రెడ్డి రీమేక్.. మరో హీరోయిన్?

టాలీవుడ్ బాక్స్ ఏపీ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన అర్జున్ రెడ్డి మూవీ మిగతా భాషల్లో ఎంతవరకు విజయం సాధిస్తుందో అనే విషయం మొదటి నుంచి సౌత్  హాట్ టాపిక్ టీగా మారింది. అయితే తమిళ్ లో మాత్రం సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఇబ్బందులు ఎదుర్కోవడం అందరిని షాక్ కి గురి చేస్తోంది.

arjun reddy remake lvarma latest news
Author
Hyderabad, First Published Feb 15, 2019, 8:54 PM IST

టాలీవుడ్ బాక్స్ ఏపీ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన అర్జున్ రెడ్డి మూవీ మిగతా భాషల్లో ఎంతవరకు విజయం సాధిస్తుందో అనే విషయం మొదటి నుంచి సౌత్  హాట్ టాపిక్ టీగా మారింది. అయితే తమిళ్ లో మాత్రం సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఇబ్బందులు ఎదుర్కోవడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. రీసెంట్ గా దర్శకుడు బాలను - హీరోయిన్ ని తప్పిస్తున్నట్లు ఒక క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. 

అయితే వర్మ సినిమాకు డైరెక్టర్ గా ఒరిజినల్ తెలుగు అర్జున్ రెడ్డికి వర్క్ చేసిన డైరెక్టర్ సందీప్ వంగ శిష్యుడు గిరీశయ్య డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక హీరోయిన్ గా ఒక బాలీవుడ్ బ్యూటీని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇటీవలఅక్టోబర్ సినిమాతో నార్త్ జనాలను ఆకర్షించిన బణిత సందు తమిళ్ రీమేక్ లో నటించే ఛాన్స్ ఉందని అలాగే నిర్మాత విక్రమ్ తో మాట్లాడి ఆమెను ఫైనల్ చేశారని టాక్ వస్తోంది. 

అయితే ఇది ఎంతవరకు నిజం అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విక్రమ్ తనయుడు ధృవ్ మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై కోలీవుడ్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే సినిమా అవుట్ ఫుట్ ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తోన్న విక్రమ్ ఇటీవల మేకింగ్ పై అసంతృప్తి చెందడంతో సినిమా షూటింగ్ మొత్తం క్యాన్సిల్ అయినట్లు టాక్. త్వరలోనే రీ షూట్ చేసి సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేయాలని విక్రమ్ ఆలోచిస్తున్నారు.       

Follow Us:
Download App:
  • android
  • ios