Asianet News TeluguAsianet News Telugu

అంతరిక్షం ట్రైలర్: మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఘాజి దర్శకుడు!

ఘాజి సినిమాతో సముద్ర గర్భంలో జరిగిన యుద్దాన్ని చూపించిన సంకల్ప్ రెడ్డి ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలోకి తీసుకెళుతున్నాడు. 

antharikshyam trailer
Author
Hyderabad, First Published Dec 9, 2018, 11:34 AM IST

టాలీవుడ్ మార్కెట్ పరంగా అలాగే కంటెంట్ పరంగా ఇంటర్నేషనల్ స్థాయిలో పరిగెడుతోంది అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా యువ దర్శకులు ప్రయోగాలతో సీనియర్ దర్శకులని ఆశ్చర్యపరుస్తున్నారు. ఘాజి సినిమాతో సముద్ర గర్భంలో జరిగిన యుద్దాన్ని చూపించిన సంకల్ప్ రెడ్డి ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలోకి తీసుకెళుతున్నాడు. 

అంతరిక్షం 9000KMPH ట్రైలర్ ను నేడు విడుదల చేశారు. అనంత విశ్వంలో ఏం జరిగింది ప్రపంచంకోసం ఆలోచించిన కథానాయకుడు దేశ ఖ్యాతిని ఏ విధంగా నిలబెట్టాడు అనేది డిసెంబర్ 21న తెలుసుకోవాలి. దర్శకుడు క్రిష్ ఫస్ట్ ఫ్రెమ్ ప్రొడక్షన్ తో కలిసి సినిమాను నిర్మించారు. అదితి రావ్ మరో వ్యోమగామిగా నటించారు. ప్రపంచం మొత్తం శాటిలైట్ కమ్యూనికేషన్ దెబ్బతినే ప్రమాదం ఉందని నెట్వర్క్ ని ఏ విధంగా సెట్ చేశారు అనే అంశం ట్రైలర్ లో ఆసక్తిని రేపుతోంది. 

మరోవైపు లవ్ యాంగిల్ ని కూడా దర్శకుడు కథలో భాగంగా సెట్ చేసినట్లు అర్ధమవుతోంది. ఎమోషనల్ సీన్స్ అండ్ అంతరిక్షంలో సాగే ప్రయాణం సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. గ్రాఫిక్స్ పరంగా మరోకొత్త ప్రపంచంలోకి సినిమా తీసుకెళ్లడం గ్యారెంటీ అని చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రశాంత్ విహారి ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా క్రిస్మస్ సెలవుల్లో మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.    

                                                      

Follow Us:
Download App:
  • android
  • ios