Asianet News TeluguAsianet News Telugu

'అంతరిక్షం' ఫస్ట్ డే కలెక్షన్స్!

తెలుగులో మొదటిసారి రూపొందిన స్పేస్ చిత్రం 'అంతరిక్షం'. 'ఘాజీ' లాంటి సినిమాను రూపొందించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. 

anthariksham movie first day collections
Author
Hyderabad, First Published Dec 22, 2018, 2:16 PM IST

తెలుగులో మొదటిసారి రూపొందిన స్పేస్ చిత్రం 'అంతరిక్షం'. 'ఘాజీ' లాంటి సినిమాను రూపొందించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఈ సినిమా టీజర్, ట్రైలర్ అంచనాలకు మించి ఉండడంతో సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని భావించారు. కానీ ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఏవరేజ్ టాక్ తో సరిపెట్టుకోవాల్సివచ్చింది.

దానికి తగ్గట్లే ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. నిజానికి సినిమాపై ఉన్న క్రేజ్ తో ఓపెనింగ్స్ భారీగా వస్తాయని ఆశించిన చిత్రబృందానికి షాక్ తగిలింది. నిన్న చాలా సినిమాలు విడుదల కావడంతో ఆ ప్రభావం ఈ సినిమాపై పడింది. మొదటిరోజు కేవలం రూ.1.24 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టింది.

ఏరియాల వారీగా కలెక్షన్లు.. 
నైజాం........................................... 0.49 కోట్లు 
సీడెడ్........................................... 0.18 కోట్లు 
ఉత్తరాంధ్ర................................... 0.18 కోట్లు 
గుంటూరు..................................... 0.16 కోట్లు 
ఈస్ట్...............................................0.07 కోట్లు 
వెస్ట్................................................0.05 కోట్లు 
కృష్ణ...............................................0.07 కోట్లు
నెల్లూరు..........................................0.04 కోట్లు 

మొత్తం కలుపుకొని సినిమా రాబట్టింది 1.24 కోట్లు. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూ.19 కోట్లు చేయడంతో ఆ రేంజ్ లో వసూళ్లు వస్తాయనుకున్నారు. మరి ఇప్పుడు బయ్యర్లకు నష్టాలు కలిగితే ఎవరు భరిస్తారో చూడాలి!
 

Follow Us:
Download App:
  • android
  • ios