Asianet News TeluguAsianet News Telugu

మహేష్ ప్రాజెక్టుకు అనీల్ రావిపూడి రెమ్యునరేషన్ ఎంత?

ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హ‌ర్షి  సినిమా చేస్తున్న మహేష్ తన తదుపరి సినిమా ఎవరితో చేస్తాడనేది అందరిలో ఆసక్తికరమైన అంశంగా డిస్కషన్ గా మారింది. సుకుమార్ తో సినిమా అనుకుంటే ఊహించని విధంగా ఆయన ప్రక్కకు వెళ్లి...సీన్ లోకి అనీల్ రావిపూడి వచ్చారు. 

Anil Rapudi remunation For Mahesh Project
Author
Hyderabad, First Published Mar 7, 2019, 4:37 PM IST

ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హ‌ర్షి  సినిమా చేస్తున్న మహేష్ తన తదుపరి సినిమా ఎవరితో చేస్తాడనేది అందరిలో ఆసక్తికరమైన అంశంగా డిస్కషన్ గా మారింది. సుకుమార్ తో సినిమా అనుకుంటే ఊహించని విధంగా ఆయన ప్రక్కకు వెళ్లి...సీన్ లోకి అనీల్ రావిపూడి వచ్చారు. 

పటాస్‌, సుప్రీమ్, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌2 ఇలా వ‌రుస హిట్స్ తో దూసుకెళుతున్న అనీల్ రావిపూడి రీసెంట్ గా మ‌హేష్‌ని క‌లిసి ఓ స్టోరీ లైన్ వినిపించ‌గా, అది మ‌హేష్‌కి న‌చ్చ‌డంతో ఈ ప్రాజెక్ట్ చేద్దామ‌ని మాట ఇచ్చాడ‌ట‌.  దిల్ రాజు, అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించ‌నున్నార‌ని టాక్. హీరోయిన్స్ ఎంపిక కూడా జరుగుతోంది. ఈ నేపధ్యంలో దర్శకుడు అనీల్ రావిపూడికు ఎంత రెమ్యునేషన్ ఇవ్వబోతున్నారనే విషయం చర్చకు వస్తోంది. 

అందుతున్న సమాచారం మేరకు పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనీల్ రావిపుడి ఈ హిట్ తో తన రెమ్యునరేషన్ కూడా పెంచాడని తెలుస్తుంది.  మొన్నటిదాకా సినిమాకు మూడు కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ గా తీసుకునే అనీల్ రావిపుడి ఎఫ్-2 హిట్ తో 5 కోట్లు చేశాడట.  దానికి తోడు మహేష్ సినిమా కావటంతో ఈ మొత్తాన్ని ఆయనకు ఇస్తున్నారట. 

అనీల్ రావిపూడి చేసిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు దిల్ రాజు నిర్మాణంలో వచ్చాయి. తన తర్వాత సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లోనే ఉంటుందని  ఉంది. అదే  బయిట బ్యానర్ లో చేస్తే ఇంకా ఎక్కువ రెమ్యునేషన్ ఉండే అవకాసం ఉంది. కానీ దిల్ రాజు బ్యానర్ కావటంతో కాస్త కంట్రోలులోనే ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios