Asianet News TeluguAsianet News Telugu

బన్నీ, త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్..?

'అరవింద సమేత' చిత్రంతో సక్సెస్ అందుకున్న త్రివిక్రమ్ తన తదుపరి సినిమా అల్లు అర్జున్ ఉంటుందని అంతా అనుకున్నారు. అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ కోసం కొన్నాళ్లు ఎదురుచూశాడు. 

allu arjun film with trivikram called off?
Author
Hyderabad, First Published Dec 10, 2018, 11:13 AM IST

'అరవింద సమేత' చిత్రంతో సక్సెస్ అందుకున్న త్రివిక్రమ్ తన తదుపరి సినిమా అల్లు అర్జున్ ఉంటుందని అంతా అనుకున్నారు. అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ కోసం కొన్నాళ్లు ఎదురుచూశాడు. త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేస్తారని అనుకుంటుంటే ఇప్పుడు ఈ సినిమా క్యాన్సిల్ అయిందని టాక్.

గీతాఆర్ట్స్ నిర్మాణ సంస్థ అనుచరుల నుండి ఈ విషయం బయటకి పొక్కింది. తన తోటి హీరోలతో పోలిస్తే ఇప్పటికే బన్నీ తన సినిమాల విషయంలో వెనుకబడ్డాడు. అతడి సక్సెస్ ట్రాక్ దెబ్బతింది. దీంతో తన తదుపరి సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలో కథ సిద్ధం చేయమని త్రివిక్రమ్ కి ఇంత కాలం సమయం ఇచ్చాడు. కానీ ఫైనల్ నేరేషన్ అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కి నచ్చకపోవడంతో ఈ సినిమాను పక్కన పెట్టాలని చూస్తున్నారట. బన్నీ కూడా ఈ సినిమా విషయంలో నిర్ణయాన్ని అల్లు అరవింద్ కి వదిలేసినట్లు చెబుతున్నారు. 

ప్రస్తుతానికి ఈ కథ పక్కన పెట్టి బన్నీకి హిట్ ఇచ్చే మరో టాప్ డైరెక్టర్ తో సినిమా చేయాలనుకుంటున్నారు. నిజానికి బన్నీ.. విక్రమ్ కుమార్ తో సినిమా చేయాల్సివుంది. ఆ స్థానంలోకి త్రివిక్రమ్ వచ్చాడు. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కూడా క్యాన్సిల్ అవుతుందని సమాచారం. మరి బన్నీకి హిట్ ఇచ్చే డైరెక్టర్ ఎవరో చూడాలి!

Follow Us:
Download App:
  • android
  • ios