Asianet News TeluguAsianet News Telugu

లీక్ : 'మహర్షి'లో అల్లరి నరేష్ క్యారక్టర్

వంశీ పైడిపల్లి – మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మహర్షి’. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో... పూజా హెగ్డే హీరోయిన్. 

allari naresh's role from mahesh 'maharshi'
Author
Hyderabad, First Published Apr 1, 2019, 4:25 PM IST

వంశీ పైడిపల్లి – మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మహర్షి’. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో... పూజా హెగ్డే హీరోయిన్. ఈ చిత్రంలో అల్లరి నరేష్ పాత్ర గురించి లీకైన ఓ టిట్ బిట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలో అల్లరి నరేష్ పాత్ర ఏమిటి..దాని ఇంపాక్ట్ మహేష్ పై ఎలా ఉంటుందనే విషయం బయిటకు వచ్చింది.

అదేమిటంటే.. అల్లరి నరేష్, మహేష్, పూజ హెడ్గే ముగ్గురూ చిన్ననాటి ఫ్రెండ్స్. అయితే మహేష్ తన చదువు నిమిత్తం అమెరికా వెళ్లి అక్కడ సెటైలై కోట్లు సంపాదిస్తాడు. అక్కడ లైఫ్ స్టైల్ లో కలిసిపోతాడు. అయితే ఓ రోజు అనుకోకండా అల్లరి నరేష్ గురించిన ఓ వార్త అతన్ని చేరుతుంది. అదేమిటంటే.. అతను ఆత్మహత్యా ప్రయత్నం చేసాడని. 

దాంతో తట్టుకోలేక స్నేహితుడుకి ఏం కష్టం వచ్చిందో అని తెలుసుకుని ధైర్యం చెప్పటానికి ఇండియా వస్తాడు. అయితే అక్కడకు వచ్చి అతని ఆత్మహత్యకు దారి తీసిన పరిస్దితులు మరేవో కాదని, వ్యవసాయం అని తెలుసుకుంటాడు. ఆ క్రమంలో ఇక్కడ రైతు ఎంత కష్టమైన జీవితం గడుపుతున్నాడో అర్దం చేసుకుంటాడు. దాంతో కొద్ది కాలం అక్కడ ఉండి ఆ సమస్యలు చక్కదిద్దుదామనుకుంటాడు. కానీ ఈ లోగా నరేష్ చనిపోతాడు.

అతని మరణం మహేష్ పై తీవ్రమైన ముద్ర వేస్తుంది. ఇక్కడే ఉండి అధునాతన పద్దతులు ఇంట్రడ్యూస్ చేస్తూ వ్యవసాయాన్ని ఇంప్రూవ్ చేసి, మరికొన్ని చావులు ఆపాలనుకుంటాడు. రుషి కాస్తా మహర్షి అవుతాడు. ఇదే ఈ సినిమా కీ పాయింట్ అని చెప్పుకుంటున్నారు. 

ఇక ఇప్పటికే ‘ఛోటీ ఛోటీ బాతే..’ అంటూ సాగే పాటను ఫస్ట్ సింగిల్ గా  విడుదల చేసారు. ఆ పాట విడుదలైన వెంటనే రికార్డ్ లు క్రియేట్ చేసే దిసగా పరుగులు పెడుతోంది.  ఉగాదిన టీజర్‌ విడుదల చేస్తారని సమాచారం.  

వచ్చే మే నెల 9 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి  సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios