Asianet News TeluguAsianet News Telugu

ఆ హోటల్ లో టీఆర్ఎస్ నాయకుల రాసలీలలు.. శ్రీరెడ్డి కామెంట్స్!

తెలంగాణాలో ఎన్నికల నేపధ్యంలో నటి శ్రీరెడ్డి.. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకూడదని మహాకూటమిని గెలిపించాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. 

actress sri reddy comments on kcr government and ktr
Author
Hyderabad, First Published Dec 10, 2018, 11:43 AM IST

తెలంగాణాలో ఎన్నికల నేపధ్యంలో నటి శ్రీరెడ్డి.. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకూడదని మహాకూటమిని గెలిపించాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. తాజాగా ఆమె ఫేస్ బుక్ లైవ్ లో కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేసింది.

శ్రీరెడ్డి మాట్లాడుతూ.. ''దొరల పరిపాలన ఉండకూడదని తెలంగాణా రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఆంద్ర, తెలంగాణా ఫీలింగ్ తెచ్చి టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఈ నాలుగేళ్ల పరిపాలనలో ఎంత దోచుకోవాలో అంతా దోచుకున్నారు. ఆడపిల్లల్ని కాపాడలేని పరిస్థితిలో తెలంగాణా ప్రభుత్వం ఉంది. నాకు అన్యాయం జరిగితే ఎక్కడో విదేశాల్లో ఉన్నవారు స్పందించారు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్, కవిత గారు స్పందించలేదు. 

బతుకమ్మ కోసం కోట్లు ఖర్చు పెట్టారు. ఎవరు ఆడుకోవడానికి అంత ఖర్చు. హైదరాబాద్ లో పార్క్ హయత్ హోటల్ లో టీఆర్ఎస్ నాయకులు ఎవరితో రాసలీలలు సాగించారో నాకు తెలుసు. వాళ్ల పేర్లు బయటపెడితే టీఆర్ఎస్ నాయకుల గుండెలు ఆగిపోతాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం తమకు ఎదురొచ్చిన వారిపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారనే దానికి ఉదాహరణ రేవంత్ రెడ్డి.

పార్క్ హయత్ లో ఏం జరిగిందో.. ఎంతమంది అమ్మాయిలు వచ్చారో చెప్పే ధైర్యం కేసీఆర్ గారికి ఉందా..?. అప్పట్లో టాలీవుడ్ లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసు ఏమైంది..?ఎందుకు ఆ కేసు మూసేశారు..? ఒకవేళ మూయకపోతే ఇప్పుడు ఆ కేసు పరిస్థితి ఏంటి..?నేను హైదరాబాద్ నుండి తమిళనాడుకి వచ్చి ఇక్కడ తల దాచుకోవడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమే.. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా.. వాళ్ల నాశనం కోరుకుంటుంది'' అంటూ ఆరోపణలు చేసింది. 
 

హాట్ టాపిక్: స్టార్ పొలిటీషియన్ తో హీరోయిన్ ఎఫైర్!

Follow Us:
Download App:
  • android
  • ios