Asianet News TeluguAsianet News Telugu

శరత్ బాబుతో సంబంధంపై క్లారిటీ ఇచ్చిన నమిత

  • గత కొంత కాలంగా శరత్ బాబు, నమితల రిలేషన్ షిప్ గురించి రూమర్స్
  • శరత్ బాబుతో సంబంధంపై క్లారిటీ ఇచ్చిన నమిత
  • తనకు శరత్ బాబుతో సంబంధమా అంటూ అవాక్కయిన నమిత
  • ఇప్పటికే నమితను చూసి ఎనిమిదేళ్లయిందని స్పష్టం చేసిన శరత్ బాబు
actress namitha clarifies on relationship with sharathbabu

తన బొద్దు ముద్దు అందాలతో టాలీవుడ్ నేకాక కోలీవుడ్ ను ఊపేసిన ముద్దుగుమ్మ నమిత సీనియర్ నటుడు శరత్ బాబుని పెళ్లి చేసుకోబోతుందని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల క్రితమే ఈ రూమర్స్‌పై స్పందించిన శరత్ బాబు అదంతా కేవలం పుకార్లేనని కొట్టిపారేశాడు. అసలు ఆమెని చూసే ఎనిమిదేళ్లయిందని, ఆమెతో ఇప్పుడు నాకు పెళ్లేంటి అని స్పష్టంచేశాడు శరత్ బాబు. ఇదిలావుంటే, తాజాగా ఈ రూమర్స్ పై నమిత కూడా స్పందించింది.



శరత్ బాబుని పెళ్లి చేసుకోనున్న నమిత అని వస్తున్న వార్తల్ని చూసిన నమిత ఒక్కసారిగా అవాక్కయ్యిందట. జనం ఇలా ఎలా నోటికొచ్చినట్టు పుకార్లు గురించి చెప్పుకుంటారు అని ఆశ్చర్యం వ్యక్తం చేసిన నమిత అందులో ఇసుమంతైనా నిజం లేదని తీవ్రంగా ఖండించింది.

Follow Us:
Download App:
  • android
  • ios