Asianet News TeluguAsianet News Telugu

‘మహర్షి’కు లెంగ్త్ సమస్య.. మహేష్ హెచ్చరిక!

పూర్వ కాలంలో ఎంత ఎక్కువ లెంగ్త్ ఉంటే ఆ సినిమా అంత ప్లస్ అయ్యేది. జనం లెంగ్త్ ఎక్కువ సినిమాలను ఎక్కువగా ఆదరించేవారు. అయితే రోజులు మారాయి.. పరిస్దితులు మారాయి. 

About Mahesh's Maharshi movie length
Author
Hyderabad, First Published Mar 11, 2019, 10:06 AM IST

పూర్వ కాలంలో ఎంత ఎక్కువ లెంగ్త్ ఉంటే ఆ సినిమా అంత ప్లస్ అయ్యేది. జనం లెంగ్త్ ఎక్కువ సినిమాలను ఎక్కువగా ఆదరించేవారు. అయితే రోజులు మారాయి....పరిస్దితులు మారాయి. ఇప్పుడు లెంగ్త్ ఎక్కువ ఉంటే సినిమాకు ఇబ్బందిగా మారుతోంది. రిలీజ్ అయ్యాక చాలా సినిమాలకు లెంగ్త్ కట్ చేసిన సందర్బాలు చూస్తూనే ఉన్నాం. ఈ నేపధ్యంలో దర్శక,నిర్మాతలు సినిమా లెంగ్త్ అనేది ఓ కీలకాంశం గా పరిగణిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మహేష్ తాజా చిత్రం మహర్షికు లెంగ్త్ ప్లాబ్లం రాబోతోందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. ఇది మహేష్ 25వ సినిమా కూడా కావటంతో మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. దిల్‌ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వేసవి కానుకగా మే 9 న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ చిత్రం లెంగ్త్  చాలా ఎక్కువగానే ఉండబోతుంది అనే ఫిలిం నగర్ టాక్.  సినిమాలో ఎమోషనల్ కంటెంట్ చాలా ఉండటంతో..   ఒక్క సీన్ కట్ అయిన కూడా ఆ ఎమోషన్ సరిగ్గా పండదని అని డైరెక్టర్ వంశీ పైడిపల్లి భావిస్తున్నారని సమాచారం. అందుకోసం సినిమాని నిడివి ఎక్కువైనా పర్లేదు అని చెప్పి అదే ఫ్లో ని కంటిన్యూ చేస్తున్నాడు వంశీ. అయితే మహేష్ మాత్రం లెంగ్త్ విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారని, మొత్తం ఎడిట్ పూర్తయ్యాక..ఫైనల్ వెర్షన్ ని టీమ్ అంతా చూసి ఫైనల్ చేద్దామని వంశీ చెప్పి ఒప్పించినట్లు సమాచారం. 

‘దిల్‌’ రాజు ఈ సినిమా గురించి మాట్లాడుతూ– ‘‘ఈ కథ కోసం వంశీ రెండేళ్లు కష్టపడ్డాడు. సినిమా బాగా వచ్చింది. యూనిట్‌ అంతా చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాం. అశ్వినీదత్‌గారు, నేను, పివీపీగారు సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందని నమ్మకంగా ఉన్నాం.  

మహేశ్‌గారి కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీస్‌గా ‘మహర్షి’ నిలుస్తుంది. ఈ ఏడాది సంక్రాంతికి మా బ్యానర్‌లో ‘ఎఫ్‌2’ తో బ్లాక్‌బస్టర్‌ కొట్టాం. ఈ సమ్మర్‌కి కూడా ‘మహర్షి’తో బ్లాక్‌బస్టర్‌ కొడుతున్నాం. ‘ఒక్కడు, పోకిరి, శ్రీమంతుడు’ సినిమాల తరహాలో ఈ సినిమాలో నావల్‌ పాయింట్‌ ఉంటుంది. సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడు మన వంతుగా ఏం చేస్తున్నాం అనే ఫీలింగ్‌తో వస్తాడు’’ అన్నారు. 

సెకండాఫ్ లో అల్లరి నరేష్ పాత్ర హై లైట్ అవ్వనున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: కె.యు.మోహనన్‌

Follow Us:
Download App:
  • android
  • ios