store bannerentertainment
By asianet news Telugu Team | 03:28 PM June 16, 2017
"మరకతమణి" మూవీ రివ్యూ

Highlights

  • చిత్రం : మరకతమణి
  • జానర్ : అడ్వెంచరస్ కామెడీ థ్రిల్లర్
  • తారాగణం: ఆది పినిశెట్టి, నిక్కి గర్లాని, అనంత్‌రాజ్‌, కోటశ్రీనివాసరావు, రాందాస్‌ తదితరులు
  • సంగీతం: దిబు నినన్‌ థామస్‌
  • దర్శకత్వం: ఎ.ఆర్‌.కె.శరవణన్‌
  • నిర్మాణం: రిషి మీడియా, శ్రీచక్ర ఇన్నోవేషన్స్‌
  • రేటింగ్‌: 2.75/5

ఇటు తెలుగు, అటు తమిళంలో రెండు భాషల్లో డిఫరెంట్‌ కథలతో ప్రయత్నిస్తూనే మరో వైపు విలన్‌గా కూడా నటిస్తూ వస్తున్నాడు ఆది పినిశెట్టి. రెండేళ్ళ క్రితం మలుపు ద్వారా మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్న ఆది పినిశెట్టి ఇప్పుడు హీరోగా తెలుగు, తమిళంలో చేసిన ప్రయత్నమే 'మరకతమణి'. అడ్వెంచరస్‌ కాన్సెప్ట్ తో.. రూపొందిన మరకతమణి ఎలాంటి అంచనాలు క్రియేట్‌ చేసిందో తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం..

కథ:

తన అప్పులను తీర్చడానికి రాందాస్‌(రాందాస్‌) అనే స్మగ్లింగ్‌ గ్యాంగ్‌లో చేరుతాడు రఘునందన్‌(ఆదిపినిశెట్టి). చిన్న దొంగతనాలు కాకుండా పెద్ద దొంగతనంతో తన అప్పులను తీర్చుకోవాలన్నది రఘు ఆలోచన. రఘు అలేఖ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అలేఖ్యకు అప్పటికే పెళ్ళి కుదరడంతో పెళ్ళి చేసేసుకుంటుంది. ఆ విషయం తెలిసిన రఘు బాధపడతాడు. చివరకు ఆమెను మరచిపోయే ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడే మరకతమణిని తెస్తే పదికోట్లు ఇస్తానని ఓ చైనా స్మగ్లర్ నుండి డీల్‌ రావడంతో రఘు డీల్‌ ఒప్పుకుంటాడు. అయితే మరకతమణిని సాధించడం అంత సులభం కాదని, మణిని ఎలా చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో మరకతమణిని తాకిన 132 మంది చనిపోయారని, వారు ఆత్మలుగా మారారని రఘుకి ఓ స్వామిజీ ద్వారా తెలుస్తుంది.

అయితే ఆ స్వామిజీయే ఆ మణిని సాధించడానికి మార్గం చెబుతాడు. ఆ మార్గంలో తన స్నేహితుడు బుజ్జిబాబు, చనిపోయిన మావయ్య ఆత్మను సహాయానికి పిలుస్తారు. ఆ ఆత్మ తన స్నేహితులను తోడు పిలుచుకుని రఘునందన్‌కు సహాయం చేయడానికి రెడీ అవుతుంది. ఈ ప్రయత్నంలో సిటీలోనే పెద్ద రౌడీ అయిన ట్వింకిల్‌ రామనాథన్‌(అనంత్‌రాజ్‌) కూడా రఘు టీంను పట్టుకుని మణిని సంపాదించుకోవాలనుకుంటుంది. అప్పుడు రఘు ఏం చేస్తాడు? మణిని సంపాదిస్తాడా? రఘు సమస్యలు తీరిపోయాయా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా వుందంటే :

ఆది పినిశెట్టి కథలోని పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా చూస్తే ఆది స్క్రిప్ట్‌ సెలక్షన్‌ విషయంలో ఎంత కేర్‌ తీసుకుంటున్నాడనేది అర్థమవుతుంది. అలాగే ఎక్కడా హీరోయిజం చూపించాలనుకోలేదు. అలాగే నిక్కి గ్లామర్‌ పాత్ర కాకుండా డిఫరెంట్‌ పాతల్రో కనపడుతుంది. రాందాస్‌, అనంత్‌రాజ్‌ సహా అందరూ తమ వంతుగా సినిమాను సీరియస్‌గా కాకుండా కామెడి స్టయిల్లో ముందుకు వెళ్లేలా చూశారు. అడ్వెంచెరస్‌ మూవీ అంటే ఏదో సాహసాలు చేయాలనే పంథాలో కాకుండా కామెడిగా నడిపించాడు. కథ ప్రారంభం నుండి చివరి వరకు సినిమా కామెడి టచ్‌తోనే ముందుకు సాగతుంది. హీరో, ఆత్మలను ఆహ్వానించడం, ఆ ఆత్మలు వీరితో పండించే కామెడి ప్రేక్షకులను ఆట్టుకుంటుంది. అలాగే నిక్కి గర్లాని మగ గొంతు ఉన్న వస్తాదు తరహా ఆత్మగా చక్కగా నటించింది. రాందాస్‌ సినిమాలో కామెడిని పండించడంలో కీ రోల్‌ను పోషించాడు. ఎక్కడా డబుల్‌ మీనింగ్‌ లేని కామెడి ట్రాక్‌ ఆకట్టుకుంది. విలన్‌ గ్యాంగ్‌ హీరో గ్యాంగ్‌ను చిత్ర హింసలు పెట్టాలనుకునే సందర్భంలో కూడా కామెడిట్రాక్‌ నవ్విస్తుంది. అనంత్‌రాజ్‌ కూడా ఇందులో సీరియస్‌గా ఉంటూనే కామెడి పండించడం, అనంత్‌ రాజ్‌ వాడే రేడియో, దాని వల్ల వచ్చే కామెడి అందరినీ అలరిస్తాయి. సినిమాటోగ్రాఫర్‌ శంకర్‌ పనితీరు చాలా బావుంది. చక్కగా పిక్చరైజ్‌ చేశాడు. ఇక దిబునినన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు ప్లస్‌ అయ్యింది. అయితే సినిమలో ఎక్కువగా తమిళ నెటివిటీ కనపడుతుంది. కాబట్టి సినిమా తెలుగు ప్రేక్షకులకు ఆట్టుకుంటుందా అనే విషయంలో సందేహం వస్తుంది. లాజిక్స్‌ మిస్‌ అయ్యాయి. బ్రహ్మానందం క్యారెక్టర్‌ను అనవసరంగా ఇరికించినట్లుంది. మొత్తం మీద సినిమా చూసిన ప్రేక్షకుడు ఓ స్మైల్‌తో బయటకు వస్తాడు.

ప్లస్ పాయింట్స్ :

ఆది పినిశెట్టి సింప్లీ సూపర్బ్ అనిపించాడు. ఆర్భాటాలకు పోకుండా సింపుల్ గా మెప్పించాడు. ఇక కామెడీ సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అనంత్ రాజ్, రాందాస్ ల కామెడీ అలరించింది.

మైనస్ పాయింట్స్ :

కథనంలో కాస్త వేగం మందగించినట్లు అనిపిస్తుంది. స్టోరీని నరేట్ చేయటం కాస్త డ్రాగ్ చేసినట్లుగా అనిపించడం కాస్త మైనస్ అని చెప్పాలి. ట

చివరగా :

మరకతమణి..అడ్వెంచర్..కాదు కాదు కామెడీ కామెడీ కామెడీ

Show Full Article


Recommended


bottom right ad