Asianet News TeluguAsianet News Telugu

2018: ఈ ఏడాది ఫ్లాప్ హీరో కిరీటం ఇతడికే..

ఈ ఏడాదిలో తమ సినిమాలతో మెప్పించిన హీరోలు చాలా మంది ఉన్నారు. అలానే హ్యాట్రిక్ ఫ్లాప్ లు అందుకున్న హీరోలు కూడా ఉన్నారు. ఎంత మంది ఎన్ని ఫ్లాప్ లు అందుకున్నా.. ఫ్లాప్ హీరో కిరీటం మాత్రం రవితేజకే దక్కుతుంది. 

2018: Flop Hero of The Year
Author
Hyderabad, First Published Dec 25, 2018, 10:17 AM IST

ఈ ఏడాదిలో తమ సినిమాలతో మెప్పించిన హీరోలు చాలా మంది ఉన్నారు. అలానే హ్యాట్రిక్ ఫ్లాప్ లు అందుకున్న హీరోలు కూడా ఉన్నారు. ఎంత మందిఎన్ని ఫ్లాప్ లు అందుకున్నా.. ఫ్లాప్ హీరో కిరీటం మాత్రం రవితేజకే దక్కుతుంది.

ఈ ఏడాదిలో వరుసగా మూడు అట్టర్ ఫ్లాప్ సినిమాల్లో నటించి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించాడు రవితేజ. 'రాజా ది గ్రేట్' సినిమా తరువాత రవితేజ నటించిన 'టచ్ చేసి చూడు' సినిమాతో ఫ్లాప్ లు మొదలయ్యాయి. విక్రమ్ సిరికొండ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సినిమాలో భాగమైన వారికి అరవై శాతం నష్టాల్ని తీసుకొచ్చింది. 

ఆ తరువాత 'నేల టికెట్' సినిమాపై కొంత బజ్ పెరిగింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ బ్యాక్ టు బ్యాక్ అక్కినేని హీరోలతో సక్సెస్ లు అందుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 'టచ్ చేసి చూడు' సినిమా కంటే పెద్ద ఫ్లాప్ గా తేల్చేశారు ట్రేడ్ పండితులు.

ఈ రెండు ఫ్లాప్ లతో డీలా పడ్డ రవితేజ 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూశాడు. శ్రీనువైట్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమా విడుదలకు ముందు చాలా హడావిడి చేసింది. కానీ వైట్ల ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. 

దీంతో ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇలా వరుస ఫ్లాప్ చిత్రాలతో రవితేజ కెరీర్ దైలమాలో పడింది. మార్కెట్ లో ఈ మాస్ హీరో రేంజ్ బాగా తగ్గిపోయింది. వచ్చే ఏడాదిలోనైనా మాస్ మహారాజా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి!

2018: ఈ ఏడాది చెత్త సినిమాలు ఇవే..

2018: చిన్న చిత్రాలు.. కోట్లలో లాభాలు!

2018 లో కనిపించని హీరోలు వీళ్లే..!

Follow Us:
Download App:
  • android
  • ios