Asianet News TeluguAsianet News Telugu

'2.0' మేకర్స్ కి షాక్.. ఆన్ లైన్ లో సినిమా లీక్!

భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా '2.0'. శంకర్ రూపొందించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ లు నటించారు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. 

2.0 full movie leaked online by Tamilrockers
Author
Hyderabad, First Published Nov 29, 2018, 4:50 PM IST

భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా '2.0'. శంకర్ రూపొందించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ లు నటించారు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

దాదాపు అన్ని ప్రాంతాల నుండి ఈ సినిమాపై పాజిటివ్ కామెంట్సే వినిపిస్తున్నాయి. అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ సినిమాను ఆసక్తిగా తిలకిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా పైరసీకి గురి కాకూడదనే ఉద్దేశంతో నిర్మాతలు హైకోర్టుని సంప్రదించగా.. దాదాపు 12 వేల వెబ్ సైట్లను బ్లాక్ చేసే విధంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. 

అయినప్పటికీ ఈ సినిమా పైరసీకి గురికావడం బాధాకరం. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే తమిళరాకర్స్ వెబ్ సైట్ పైరసీ లింకులను షేర్ చేసింది. ఈ ఊహించని ఘటనతో చిత్రబృందం షాక్ అయింది. అభిమానులు ఈ పరిణామంపై మండిపడుతున్నారు.

సదరు వెబ్ సైట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సౌత్ సినిమా ఇండస్ట్రీకి తమిళరాకర్స్ పెద్ద ప్రమాదంగా మారింది. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే హెచ్ డీ ప్రింట్ లను ఈ వెబ్ సైట్ ఆన్ లైన్ లో పెట్టేస్తుంది. 

ఇవి కూడా చదవండి..

'2.0'.. ఎంట్రీలోనే సినిమా ఆపేసిన అభిమానులు!

మా డైరెక్టర్ '2.0' చూడనివ్వలేదు.. హీరోయిన్ కామెంట్స్!

శంకర్ ఇచ్చిన పక్షి సందేశం.. ప్రపంచానికి ఒక వార్నింగ్!

రెండు రెట్లు గ్రాఫిక్స్..జీరో గ్రావిటి కథ (‘2.0’మూవీ రివ్యూ) 

'2.0' పైరసీ.. 12 వేల వెబ్ సైట్లు బ్లాక్!

మీడియాలో '2.0' మూవీ రివ్యూ..!

శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!

'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

2.0 ప్రీమియర్ షో రివ్యూ

'2.0' పై రాజమౌళి ట్వీట్!

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Follow Us:
Download App:
  • android
  • ios