Asianet News TeluguAsianet News Telugu

విజయ్ 180కోట్ల సినిమాకు 11కోట్ల టార్గెట్.. కష్టమే?

మెర్సల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని అందుకున్నాయి.  ఇక ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద బిగిల్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగులో విజిల్ పేరుతో విడుదల కాబోతోంది. 180కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే ఉంది. 

vijay bigil telugu pre release business
Author
Hyderabad, First Published Oct 18, 2019, 2:57 PM IST

తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు విజయ్ అభిమానుల్లో జోష్ మాములుగా లేదు. హీరో విజయ్ నెక్స్ట్ బిగిల్ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. మూడవసారి అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించడంతో అటు సినీ పరిశ్రమలో కూడా సినిమా బిజినెస్ పై అనేక కథనాలు వెలువడుతున్నాయి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన తేరి - మెర్సల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని అందుకున్నాయి.

ఇక ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద బిగిల్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగులో విజిల్ పేరుతో విడుదల కాబోతోంది. 180కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే ఉంది. దాదాపు 200కోట్ల వసూళ్ల షేర్స్ చేస్తే గాని సినిమా హిట్టవ్వదు. ఇక ఈ 180కోట్ల సినిమా తెలుగు థ్రియేటికల్ బిజినెస్ మాత్రం 10కోట్లు. ఇది చిన్న ఎమౌంట్ అయినా తెలుగులో విజయ్ కి చాలా పెద్దదనే చెప్పాలి. ఎందుకంటె గత సినిమాలకంటే అత్యధిక స్థాయిలో టాలీవుడ్ మార్కెట్ పై విజయ్ పట్టు సాధించాడు.

తుపాకీ - మెర్శల్ - సర్కార్ సినిమాలు సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకోవడమే కాకుండా సినిమాపై పెట్టిన బడ్జెట్ కి మంచి లాభాల్నే అందించాయి. దీంతో తెలుగులో ఈ సారి విజయ్ కి కొత్త టార్గెట్ సెట్టయ్యింది. మినిమమ్ 11కోట్లు షేర్స్ వసూలు చేస్తే గాని విజయ్ సక్సెస్ సాదించలేడు. ఈ సినిమాతో మిగతా హీరోల్లాగా తెలుగులో కూడా తనకంటూ ఒక మంచి మార్కెట్ సెట్ చేసుకోవాలని చూస్తున్నాడు.  

కానీ ఈ మధ్య కాలంలో తమిళ్ సినిమాలు అనుకున్నంతగా క్లిక్కవ్వడం లేదు. గతంలో మంచి లాభాలు అందుకున్న రజినీకాంత్ - కమల్ హాసన్ - సూర్య - విక్రమ్ - కార్తీ వంటి హీరోలు ఇప్పుడు తెలుగులో అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఇక ఇప్పుడు విజయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.  గతంలో ఎప్పుడు లేని విధంగా విజయ్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తున్నాడు.

ఇక యువ దర్శకుడు అట్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో విజువల్స్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమా కోసం దాదాపు 180కోట్లవరకు ఖర్చయినట్లు చిత్ర నిర్మాత ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.  AGS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమాలో విజయ్ డబుల్ రోల్ లో దర్శనమివ్వనున్నాడు.

ట్రైలర్ ఇప్పటికే 20 మిలియన్ల వ్యూవ్స్ నీ దాటేసింది. చూస్తుంటే సినిమా ఓపెనింగ్స్ స్ట్రాంగ్ గా ఉండేలా విజయ్ మంచి బజ్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా విడుదల కానున్న బిగిల్ లో యాక్షన్ సీన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని టాక్. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రలో నటించారు. మరి తెలుగులో విజయ్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios