Asianet News TeluguAsianet News Telugu

ఏది హిట్? ఈ వారం రిలీజైన సినిమాల రిజల్ట్ !

ప్రతీవారం లాగే ఈ  శుక్రవారం  నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.  రాజుగారి గది 3, అది సాయి కుమార్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్, మళ్ళీ మళ్ళీ చూసా, కృష్ణ రావు సూపర్ మార్కెట్ సినిమాలు విడుదలయ్యాయి.

This week tollywood box office result
Author
Hyderabad, First Published Oct 20, 2019, 4:18 PM IST

ప్రతీవారం లాగే ఈ  శుక్రవారం  నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.  రాజుగారి గది 3, అది సాయి కుమార్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్, మళ్ళీ మళ్ళీ చూసా, కృష్ణ రావు సూపర్ మార్కెట్ సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఈ సినిమాల్లో కాస్తంత జనాలకు ఫలానా సినిమా రిలీజ్ అయ్యింది అనే అవగాహన కలిగించింది రాజుగారి 3 సినిమా మాత్రమే.

ఎందుకంటే ఆ సినిమాకి ప్రముఖ యాంకర్ ఓంకార్ దర్శకుడు, అలాగే కొద్దో గొప్పో పేరున్న అవికా గోర్  హీరోయిన్ కావడం, ఆల్రెడీ ఇప్పటికే రాజుగారి టైటిల్ తో రెండు సినిమాలు రావటంతో సినిమాపై ప్రేక్షకులు అంతో ఇంతో ఆసక్తి చూపారు. దానికి తోడు సెకండాఫ్ లో వచ్చే ఓ ఎపిసోడ్ బాగా పండటంతో..   కోటి ఇరవై లక్షల షేర్ ఓపెనింగ్ రోజు రాబట్టింది. దాంతో ఓంకార్ అన్నయ్య ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీకెండ్ ఆ సినిమాకే కలెక్షన్స్ ఉండటం చెప్పుకోదగ్గ విషయం.

ఇక ప్రస్తుతం వరస ప్లాప్స్‌తో దూసుకుపోతున్న ఆది సాయి కుమార్ హీరో గా వచ్చిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాకి అస్సలు ప్రమోషన్స్ లేవు. ఓపినింగ్స్ లేవు.  ఈ సినిమాని వినాయకుడు దర్శకుడు అడవి సాయి కిరణ్ తెరకెక్కించారన్నా కలిసి రాలేదు. టోటల్ గా ఇది , ఆది హీరో గా వచ్చిన సినిమా కావటంతో అస్సలు క్రేజ్ లేదు.  రివ్యూలు కూడా ప్లాఫ్ అనేసాయి. దాంతో ఈ సినిమాకు జనం లేకుండాపోయారు.

ఇక  మిగిలిన రెండు సినిమాలు...మళ్ళీ మళ్ళీ చూశా సినిమా కానీ, కృష్ణారావు సూపర్ మార్కెట్ సినిమాలలో కొత్తవారు నటించారు. ఈ రెండు సినిమాలు చిన్నవే కావడం, ప్రమోషన్ లేకపోవటంతో  వీటి ఇంఫాక్ట్ బాక్సాఫీస్ వద్ద పడలేదు. ఉన్నంతలో యావరేజ్ కలెక్షన్స్‌తో రాజుగారి గది 3 ఈ వారం గట్టెక్కే సినిమాగా వుంది.  బి,సి సెంటర్లలలో ఈ కామెడీ బాగానే వర్కవుట్ అవుతోంది.

ఏదైమైనా మెగాస్టార్ సైరా తరువాత తెలుగులో చెప్పుకోవడానికి పెద్దగా సినిమాలు ఏమి రాలేదు. గోపీచంద్ చాణక్య వచ్చినా పెద్దగా ఇంపాక్ట్ లేదు. ఉన్నంతలో డబ్బింగ్ సినిమా వార్ నడుస్తోంది.  దాంతో ఈ రోజు రిలీజ్ అయ్యిన నాలుగుస్ట్రెయిట్ సినిమాల ప్రభావం పెద్దగా కనపడనట్లే కనపడుతోంది.  ఈ నాలుగు సినిమాల్లో రాజుగారి గది 3 బాక్సాఫీస్ విన్నర్.

Follow Us:
Download App:
  • android
  • ios