Asianet News TeluguAsianet News Telugu

బలుపు కాంబో.. సెట్టయిన స్టార్ హీరోయిన్

రవితేజ 66వ సినిమాతో సిద్దమవుతున్నట్లు దివాళి సందర్భంగా ఈ మధ్యే ప్రకటించారు. కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. డాన్ శీను, బలుపు లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వస్తున్నారు.

star heroines once again green signal to mass raja film
Author
Hyderabad, First Published Oct 30, 2019, 2:27 PM IST

మాస్ మహారాజా రవితేజ 66వ సినిమాతో సిద్దమవుతున్నట్లు దివాళి సందర్భంగా ఈ మధ్యే ప్రకటించారు. కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. డాన్ శీను, బలుపు లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వస్తున్నారు.

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించబోతున్నారు.  2017లో తెలుగు సినిమాలో నటించారు శృతి హాసన్‌.. ఇప్పుడు రవితేజ సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తున్నారని చెబుతున్నారు. చిత్రయూనిట్. రవితేజ, శృతి హాసన్ కలిసి నటించబోయే రెండు సినిమా ఇది.

star heroines once again green signal to mass raja film

బలుపులో ఇప్పటికే ఓ సారి నటించారు ఈ జోడీ. ఆ సినిమాను కూడా గోపీచంద్ మలినేని తెరకెక్కించడం విశేషం. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మంచి కథను సిద్ధం చేస్తున్నారు దర్శకుడు గోపీచంద్.  ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

పవర్ ఫుల్ పోలీస్ కథతో వస్తున్నారు గోపీచంద్ మలినేని. బి మధు ఈ చిత్రానికి నిర్మాత. నవంబర్‌లో సినిమా ఓపెనింగ్ జరగనుంది. మిగిలిన వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. ఇక మరోవైపు రవితేజ ప్రస్తుతం డిస్కోరాజకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు.విఐ. ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios