Asianet News TeluguAsianet News Telugu

సినిమాకి రూ.3 కోట్లు.. నిర్మాతలకు భారంగా మారిన దేవిశ్రీప్రసాద్!

రీసెంట్ గా మొదలైన చిరు, కొరటాల సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ ఉంటారనుకున్నారు. కొరటాల, దేవి కాంబినేషన్ లో హిట్ ఆల్బమ్స్ వచ్చాయి. దీంతో కొరటాల అతడినే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటారని అనుకున్నారు.

Rs 3 cr for DSP? Burden For Producers?
Author
Hyderabad, First Published Oct 26, 2019, 1:06 PM IST

ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ హవా బాగా తగ్గిందనే చెప్పాలి. అప్పట్లో ప్రతీ స్టార్ హీరో సినిమాకి దేవి ఉండాల్సిందే. అతడి రెమ్యునరేషన్ మూడు కోట్లు అయినప్పటికీ నిర్మాతలు వెనక్కి తగ్గకుండా దేవిని ఫైనల్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రీసెంట్ గా మొదలైన చిరు, కొరటాల సినిమాలో 
మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ ఉంటారనుకున్నారు.

కొరటాల, దేవి కాంబినేషన్ లో హిట్ ఆల్బమ్స్ వచ్చాయి. దీంతో కొరటాల అతడినే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటారని అనుకున్నారు. కానీ అది జరగలేదు. ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ చేతిలో మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఒక్కటే ఉంది. మరోపక్క తమన్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. 

స్పోర్ట్స్ బ్రాలో జాన్వీ లుక్.. మాములుగా లేదుగా!

అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో', రవితేజ 'డిస్కో రాజా' ఇలా అతడి చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. 'RRR' లాంటి సినిమాలకు కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తుంటాడు. మీడియం బడ్జెట్ సినిమాలకు గోపి సుందర్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు. దేవిశ్రీకి మాత్రం అవకాశాలు రావడం లేదు. దానికి కారణం అతడి రెమ్యునరేషన్ అని టాక్.

ఈ మధ్యకాలంలో దేవికి సరైన హిట్టు పడడం లేదు. అయినప్పటికీ తన రెమ్యునరేషన్ తగ్గించుకోవడం లేదట దేవి. ఒక్కో సినిమాకి మూడు కోట్ల చొప్పున ఇవ్వాల్సిందేనట. బేరాలు అసలే ఉండవట.

తమన్ ఒక సినిమాకి కోటిన్నర నుండి రెండు కోట్లు తీసుకోవడంతో నిర్మాతలు అతడితోనే మ్యూజిక్ చేయించుకుంటున్నారు. ఇప్పటికైనా దేవిశ్రీప్రసాద్ కాస్త తగ్గి తన రెమ్యునరేషన్ విషయంలో రాజీ పడితే అవకాశాలు వస్తాయనే మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో దేవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి! 

Follow Us:
Download App:
  • android
  • ios