Asianet News TeluguAsianet News Telugu

కమ్మ రాజ్యంలో పిల్ల రెడ్లు.. ఆర్జీవీ ప్రమోషన్స్  చూశారా?

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో గాని సినిమాకు సంబందించిన కాంట్రవర్సీలు మాత్రం రోజుకోటి పుట్టుకొస్తున్నాయి. సోషల్ మీడియాలో నిరంతరం సినిమాకు సంబందించిన ఎదో ఒక న్యూస్ తో ఆర్జీవీ హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

rgv tweet on kamma rajyamlo kadapa redlu song
Author
Hyderabad, First Published Nov 6, 2019, 8:12 AM IST

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న కాంట్రవర్షియల్ మూవీ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో గాని సినిమాకు సంబందించిన కాంట్రవర్సీలు మాత్రం రోజుకోటి పుట్టుకొస్తున్నాయి. సోషల్ మీడియాలో నిరంతరం సినిమాకు సంబందించిన ఎదో ఒక న్యూస్ తో ఆర్జీవీ హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక కమ్మ రాజ్యంలో కదపరెడ్లు పాటకు ఇద్దరి చిన్నారులు చేసిన డ్యాన్స్ వీడియోను రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కమ్మ రాజ్యంలో పిల్ల రెడ్లు అనే ట్యాగ్ కూడా ఇవ్వడంతో సాంగ్ తెగ వైరల్ అవుతోంది. రోజుకో కొత్త ఐడియాతో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్న ఆర్జీవీ ఓ వర్గం వారిని గట్టిగానే ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇక మరికొంత మంది ఘాటు వ్యాఖ్యలతో దర్శకుడికి కౌంటర్లు ఇస్తున్నారు.

ఇదిలా ఉండగా ట్రైలర్ లో చంద్రబాబుని పోలి ఉన్న పాత్ర తన కుమారుడికి ప్లేట్ లో పప్పు వడ్డించే సన్నివేశం ఉంది. ఈ సీన్ తీవ్ర వివాదంగా మారుతోంది. ఓ ఇంటర్వ్యూలో వర్మ దీనిపై వివరణ ఇచ్చాడు. చంద్రబాబు, లోకేష్ ని టార్గెట్ చేయడం కోసమే పప్పు సీన్ పెట్టారా అని ప్రశ్నించగా.. అసలు ఈ చిత్రంలో చంద్రబాబు, లోకేష్ పాత్రలు ఉన్నాయని ఎవరు చెప్పారు అని ఆర్జీవీ ప్రశ్నించాడు.  ఈ చిత్రంలో చంద్రబాబు, లోకేష్ ఉన్నట్లు మీకు మీరే ఊహించుకుంటే నేనేమి చేయలేను అని బదులిచ్చాడు.

అయినా ఒక తండ్రి తన కొడుకుకి భోజనం వడ్డిస్తే అది కించపరిచినట్లు ఎలా అవుతుంది. నా చిత్రంలో చంద్రబాబు, లోకేష్ పాత్రలు లేవు. మాజీ ముఖ్యమంత్రి తనయుడిని సోషల్ మీడియాలో పప్పు పేరుతో ట్రోల్ చేయడం మీకు తెలియదా అని ప్రశ్నించగా.. నాకు తెలియదు అని వర్మ సమాధానం ఇచ్చాడు.   ఆ సన్నివేశంలో నా ముఖ్య ఉద్దేశం ఓ తండ్రి కొడుకుపై చూపించే ప్రేమ మాత్రమే. మనం తినే భోజనంలో పప్పు కూడా ఉంటుంది. ప్రతి ఇంట్లో పప్పు ఉంటుంది. అందులో తప్పు ఏంటి అని వర్మ తనదైన శైలిలో వెటకారంగా బదులిచ్చాడు.

Follow Us:
Download App:
  • android
  • ios