Asianet News TeluguAsianet News Telugu

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'లో నటుడుగా వర్మ... ఏ పాత్రలోనంటే..?

టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్‌, అజయ్‌ మైసూర్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలతో కలిసి వర్మ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దర్శకుడిగా వర్మతో పాటు సిద్దార్థ్‌ తాతోలు చేస్తున్నారు. 

Ram Gopal Varma Role In Kamma Rajyamlo Kadapa Redlu
Author
Hyderabad, First Published Nov 6, 2019, 11:27 AM IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఒకప్పుడు దేశంలో అన్ని ప్రాంతాల్లో అభిమానులు ఉండేవారు. ఆయన సినిమా కోసం ఎదురుచూసేవారు. అయితే సీన్ మారింది. కొత్త దర్శకులు ఆయన ప్లేస్ లోకి వచ్చేసారు. ఆయన కూడా వాళ్లకు అవకాసం ఇవ్వటానికా అన్నట్లుగా చెత్త సినిమాలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటున్నారు. పబ్లిసిటీ మీద పెట్టే దృష్టిలో వన్ పర్శంట్ కూడా సినిమాలపై పెట్టడం లేదు.

దాంతో ఆ సినిమాలు ఎన్నో రోజులు ఆడటం లేదు. అంతేకాదు ఆయన  సినిమా క్వాలిటీ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలపైనా ఫోకస్ పెడుతున్నారు. ఆయన వాయిస్ ఓవర్ లు చెప్పటం, పాటలు రాయటం, పాడటం చేస్తున్నారు. అంతేకాదు నటనలోకి కూడా దిగారు కూడా. కోబ్రా అనే సినిమాలో డాన్ గా నటిస్తున్నట్లు ఆ మధ్య ప్రకటించారు.   ఇప్పుడు కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాలో కూడా ఒక పాత్రలో కనిపిస్తానని చెప్చతున్నారు.

కమ్మ రాజ్యంలో పిల్ల రెడ్లు.. ఆర్జీవీ ప్రమోషన్స్  చూశారా?

ఇతనే కొత్త నటుడు అంటూ తన ఫోటోని షేర్ చేశారు వర్మ.  ఆయన తన నిజ జీవిత పాత్రలోనే కనపించే అవకాసం ఉంది. అలాగే ఇక నుంచి రెగ్యులర్ గా సినిమాల్లో పాత్రలు వేసే అవకాశం ఉందంటున్నారు. టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్‌, అజయ్‌ మైసూర్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలతో కలిసి వర్మ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దర్శకుడిగా వర్మతో పాటు సిద్దార్థ్‌ తాతోలు చేస్తున్నారు.  వైయస్ జగన్‌ పాత్రకు మాత్రం రంగం ఫేం అజ్మల్‌ అమీర్‌ నటిస్తున్నాడు.  

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో ఎన్నికల ముందు రాజకీయ ప్రకంపనలు రేపిన వర్శ..ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక ‘కమ్మ రాజ్యంలోకి కడప రెడ్లు’ సినిమాతో కొత్త వివాదానికి తెరతీశారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు టార్గెట్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ట్రైలర్ చెప్పకనే చెప్తుంది. గతకొద్ది రోజులుగా సినిమాలోని వైఎస్ జగన్, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తదితరులను పోస్టర్లను రిలీజ్ చేస్తూ మూవీపై ఇంట్రస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios