Asianet News TeluguAsianet News Telugu

RRR: డోస్ పెంచిన కీరవాణి.. జక్కన్న స్పెషల్ ఫోకస్

రాజమౌళి విజయాల్లో ఎవరిపాత్ర ఎంత ఉన్నా అన్న కీరవాణిది ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. జక్కన్న ఎలాంటి సినిమా చేసినా ఆ సినిమాకు పెద్దన్న ఉండాల్సిందే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో కూడా  కీరవాణికి ఎవరుకూడా సాటిరారనే చెప్పాలి. నెక్స్ట్ ఈ బిగ్ కాంబినేషన్ లో RRR సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

rajamouli special focus on rrr movie special song
Author
Hyderabad, First Published Nov 7, 2019, 12:17 PM IST

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి విజయాల్లో ఎవరిపాత్ర ఎంత ఉన్నా అన్న కీరవాణిది ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. జక్కన్న ఎలాంటి సినిమా చేసినా ఆ సినిమాకు పెద్దన్న ఉండాల్సిందే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో కూడా  కీరవాణికి ఎవరుకూడా సాటిరారనే చెప్పాలి. నెక్స్ట్ ఈ బిగ్ కాంబినేషన్ లో RRR సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

భారీ అంచనాలతో తెరకెక్కుతున్న RRR సినిమా విడుదల కావడానికి సమయం చాలానే ఉన్నప్పటికీ సినిమాకు సంబందించిన రూమర్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్శకుడు రాజమౌళి స్వాతంత్ర సమరయోధుల పాత్రలను తీసుకొని సరికొత్త విజువల్ వండర్ నీవు క్రియేట్ చేబోతున్నాడు.   నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కోమురం భీమ్ గా కనిపించబోతుండగా  - మెగా హీరో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామ రాజుగా దర్శనమివ్వనున్నాడు.

also read:RRR: ఎన్టీఆర్, చరణ్ డైలాగులు ఎలా ఉంటాయంటే.. రాజమౌళి ఆల్రెడీ..

ఇక సినిమాలో ఎమోషన్ కంటెంట్ అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ సాలిడ్ గ ఉన్నాయి. అలాగే సాంగ్స్ కూడా సరికొత్తగా ఉండేలా దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమాలో 6పాటలకు తగ్గకుండా జాగ్రత్తలు తీయూసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 7పాటలకు కీరవాణి కంపోజింగ్ చేస్తున్నట్లు సమాచారం.  సాధారణంగా రాజమౌళి సినిమాల్లో కొన్ని బిట్ సాంగ్స్ కూడా ఉంటాయి.

సినిమా కథలో సందర్భాన్ని బట్టి కీరవాణి కంపోజ్ చేసే ఆ పాటలు స్పెషల్ గ అంటాయి. రాజమౌళి కూడా పెద్దన్న నిర్ణయాలకు పెద్దగా నో చెప్పడు. ఇక ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్నారు కాబట్టి ఇద్దరి అభిమానులకు నచ్చేలా సమానంగా మ్యూజిక్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ - అలియా భట్ ల మధ్య అయితే ఒక స్పెషల్ సాంగ్ కి ప్లాన్ రెడీ అయ్యింది.

అలాగే రామ్ చరణ్ - తారక్ ల మధ్య కూడా ఒక జాతర లాంటి సాంగ్ ని కంపోజ్ చేస్తున్నారు.  కమర్షియల్ గా కాకుండా ఉత్సవాలకు సంబందించిన వాతావరణంలో సాంగ్ ని చిత్రీకరించనున్నారట. జక్కన్న ఆ సాంగ్ పై స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హీరోలిద్దరు కూడా డ్యాన్స్ లో ఎవరికీ వారు బెస్ట్ టాలెంట్ ని కలిగి ఉన్నారు. ఒకే ఫ్రేమ్ లో ఇద్దర్ని ఎలా చూపిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఇక కీరవాణి ఇప్పటికే కొన్ని ట్యూన్స్ ని రెడీ చేసి ఉంచినట్లు తెలుస్తోంది. పనిలో పనిగా బ్యాక్ గ్రౌండ్ ని కూడా మొదలుపెట్టారట. కీరవాణి ఈ సినిమాలో సరికొత్త సౌండ్స్ ని ఎలివేట్ చేయనున్నారట. మరి మ్యూజిక్ పరంగా కీరవాణి ఈ సారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి. డివివి.దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో అజయ్ దేవ్ గన్ కీలకపాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.    

Follow Us:
Download App:
  • android
  • ios