Asianet News TeluguAsianet News Telugu

అరవింద బ్యూటీ: బాలీవుడ్ లో ఇప్పుడైనా క్లిక్కవుతుందా..?

గత కొంత కాలంగా చాలా మంది ఇదే ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ కి వెళ్లి బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకున్నారు. శ్రీదేవి నుంచి కత్రినా కైఫ్ వరకు ఇలా చాలా మంది తెలుగు సినిమాల్లో మెరిసి బాలీవుడ్ కి షిఫ్టయినవారే.

pooja hegde big hopes on housefull 4
Author
Hyderabad, First Published Oct 23, 2019, 11:49 AM IST

బాలీవుడ్ లో హీరోయిన్ గా క్లిక్కవ్వలంటే ముందు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలని ఒక సెంటిమెంట్ నడుస్తోంది. గత కొంత కాలంగా చాలా మంది ఇదే ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ కి వెళ్లి బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకున్నారు. శ్రీదేవి నుంచి కత్రినా కైఫ్ వరకు ఇలా చాలా మంది తెలుగు సినిమాల్లో మెరిసి బాలీవుడ్ కి షిఫ్టయినవారే.

అయితే అదే తరహాలో సక్సెస్ అవ్వాలని పూజ హెగ్డే కూడా గత కొంత కాలంగా తీవ్రంగా కష్టపడుతోంది. 'డీజే' సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న పూజ ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి 'అల వైకుంఠపురములో' అనే సినిమాలో  నటిస్తోంది. అలానే ప్రభాస్ తో కలిసి 'జాన్' అనే సినిమాలో నటించడానికి అంగీకరించింది. ఈ రెండు మంచి క్రేజ్ ఉన్న సినిమాలే. దీంతో అమ్మడు తన రేమ్యునరేషన్ కూడా పెంచేస్తోంది.  

ఇక బాలీవుడ్ లో అమ్మడు నెక్స్ట్ హౌజ్ ఫుల్ 4తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. గతంలోనే బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసిన పూజా హెగ్డే అనుకున్నంతగా క్లిక్కవ్వలేకపోయింది. మళ్ళీ టాలీవుడ్ లోకి వచ్చి వరుసగా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకొని బాలీవుడ్ కి బాట వేసింది. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన హౌజ్ ఫుల్ 4 సినిమాపై బాలీవుడ్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన బాక్స్ ఆఫీస్ వద్ద దీపావళికి సాలిడ్ కలెక్షన్స్ అందుతాయి,. మరి  ఆ సినిమాతో పూజా హెగ్డే ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.  ఇక పూజా బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక్కో సినిమాకి రూ.1.5 కోట్ల నుండి రూ.2 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్. ఈ రెమ్యునరేషన్ పూజకి చాలా ఎక్కువని ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

also read: అల్లు అర్జున్ ని ఆగం చేసిందట.. కేక పెట్టిస్తున్న 'రాములో రాములా' సాంగ్ టీజర్!

కానీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోయిన్లు లేకపోవడంతో మేకర్లు పూజాని తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.   సమంతకి పెళ్లి కావడం, రకుల్ క్రేజ్ తగ్గిపోవడం, రాశి, మెహ్రీన్ లాంటి వారికి స్టార్ హోదా లేకపోవడంతో ఫిలిం మేకర్ల వద్ద మరో ఆప్షన్ లేక పూజానే తీసుకుంటున్నారు. అది పూజాకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. దీంతో తన రెమ్యునరేషన్ విషయంలో అమ్మడు వెనుకడుగు వేయడం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios