Asianet News TeluguAsianet News Telugu

#MaharashtraAssemblypolls : ఓటేసిన అమీర్ ఖాన్, కిరణ్ రావు!

హర్యానాలోని 90 స్థానాలకు గాను 1,169మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 104 మంది మహిళలు ఉన్నారు. వీటితోపాటు మరో 16 రాష్ట్రాలు, ఒకే కేంద్ర పాలిత ప్రాంతంలోని 51 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్లోని సమస్తీపూర్ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 

Maharashtra Election 2019: Aamir Khan Votes For Maharashtra Polls
Author
Hamilton, First Published Oct 21, 2019, 1:15 PM IST

సార్వత్రిక ఎన్నికల తర్వాత మరోసారి దేశంలో ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం పోలింగ్ మొదలైంది.  మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను 3,237 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వారిలో 235మంది మహిళలు ఉన్నారు.

మరోవైపు హర్యానాలోని 90 స్థానాలకు గాను 1,169మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 104 మంది మహిళలు ఉన్నారు. వీటితోపాటు మరో 16 రాష్ట్రాలు, ఒకే కేంద్ర పాలిత  ప్రాంతంలోని 51 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్ లోని సమస్తీపూర్ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 

#MaharashtraAssemblyElections : ఓటేసిన వెటరన్ యాక్టర్ ప్రేమ్ చోప్రా!

ఈ ఎన్నికల్లో చాలా మంది సినీ తారలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. కాసేపటి క్రితం బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, తన భార్య కిరణ్ రావుతో కలిసి బాంద్రా (వెస్ట్) పోలింగ్ బూత్ కి చేరుకొని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ఎన్నికల్లో ఓటు వేయాలని, మంచి నాయకుడిని ఎన్నుకునే హక్కు అందరికీ ఉందని అన్నారు.  

ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 24వ తేదీన వెలువడనున్నాయి. ఏ పార్టీ గెలుపు జెండా ఎగురవేస్తుందో తెలియాలంటే ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉండగా.. ప్రధాని మోదీ  ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios