Asianet News TeluguAsianet News Telugu

గీతాంజ‌లి మృతి ప‌ట్ల చంద్ర‌బాబు, కేసీఆర్ ల సంతాపం!

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 'సీతారామ కళ్యాణం' తో పాటు అనేక తెలుగు చిత్రాల్లో ఆమె ప్రదర్శించిన నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోతుందని ముఖ్యమంత్రి అన్నారు.

Kcr chandrababu naidu condolences to actress geetanjali
Author
Hyderabad, First Published Oct 31, 2019, 3:28 PM IST

సీనియర్ నటి గీతాంజలి గురువారం నాడు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆమెను హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ఆసుపత్రిలోనే గురువారం నాడు కన్నుమూశారు. ఈ వార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 'సీతారామ కళ్యాణం' తో పాటు అనేక తెలుగు చిత్రాల్లో ఆమె ప్రదర్శించిన నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోతుందని ముఖ్యమంత్రి అన్నారు.నారా చంద్రబాబునాయుడు కూడా సంతాపం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ ని 'పెద్దయ్య' గారు అని పిలిచేదాన్ని, కోప్పడ్డారు!

''ఎన్టీఆర్ దర్శకత్వంలో 'సీతారామ కళ్యాణం' చిత్రంలో సీతగా నటించి ప్రేక్షక హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరుచుకుని, ఆ తర్వాత హాస్యనటిగా రాణించిన నటీమణి గీతాంజలిగారి మరణం విచారకరమని'' అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు. 

గీతాంజలి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి. తెలుగుతో పాటు మళయాళం, హిందీ చిత్రాల్లో కూడ ఆమె నటించారు. 62 ఏళ్ల గీతాంజలి ఎన్టీఆర్ - ఏఎన్నార్ వంటి సీనియర్ యాక్టర్స్ తో నటించారు.1961లో ఆమె మొదటిసారి తొలిసారిగా సీతారామ కళ్యాణం చిత్రం ద్వారా ఆమె సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఆ సినిమాలో సీతగా  కనిపించి  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అనంతరం సినీ కెరీర్ లో గీతాంజలి వెనక్కి తిరిగి చూసుకోలేదు. డాక్టర్ చక్రవర్తి, బొబ్బిలియుద్దం, దేవత,గూఢచారి 116 వంటి ఎన్నో డిఫరెంట్ సినిమాల్లో నటించారు.  పాత్ర ఏదైనా తన నటనతో సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేవారు,శ్రీశ్రీ మర్యాద రామన్న, కలవారి కోడలు, గుఢచారి 116, దేవత, నిండు హృదయాలు వంటి సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు కూడా చాలా బాగా క్లిక్కయ్యాయి. ఇక 1972 తరువాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. 20 ఏళ్ల అనంతరం మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios