Asianet News TeluguAsianet News Telugu

రామ్ చరణ్ కు రాజమౌళి వార్నింగ్ ..నిజమెంత?

 రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి మొదలెట్టిన మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ లేటు అవుతూ వస్తోంది. అప్పటికీ అందరీనీ ఆశ్చర్యపరుస్తూ రాజమౌళి మొదటి రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసారు.అయితే హీరోలిద్దరికీ గాయాలు అవ్వటంతో షెడ్యూల్ అప్ సెట్ అయ్యింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ పూర్తిగా ఈ ప్రాజెక్టు మీదే కాన్సర్టేట్ చేసారు. రామ్ చరణ్ మాత్రం తన ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.

Is Rajamouli warned Ram Charan?
Author
Hyderabad, First Published Oct 14, 2019, 7:44 AM IST

 

రకరకాల కారణాలతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి మొదలెట్టిన మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ లేటు అవుతూ వస్తోంది. అప్పటికీ అందరీనీ ఆశ్చర్యపరుస్తూ రాజమౌళి మొదటి రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసారు.అయితే హీరోలిద్దరికీ గాయాలు అవ్వటంతో షెడ్యూల్ అప్ సెట్ అయ్యింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ పూర్తిగా ఈ ప్రాజెక్టు మీదే కాన్సర్టేట్ చేసారు. రామ్ చరణ్ మాత్రం తన ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.

ఆర్ ఆర్ ఆర్ రెగ్యులర్ షూట్ ప్రారంభం అయ్యినప్పుడు వినయ విధేయ రామ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు చరణ్. అలాగే ఆ తర్వాత తన తండ్రి సైరా చిత్రం ప్రొడక్షన్ చూసుకుంటూనే ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. అనుకున్నట్లుగా భారీగా సైరాని పూర్తి చేసి, అదే స్దాయిలో రిలీజ్ చేసి పేరు తెచ్చుకున్నాడు. దాంతో ఇప్పుడు ఫ్రీ అవుతాడనుకున్నారు అంతా. అయితే తన తండ్రి చిరంజీవి, కొరటాల శివతో చేయబోయే సినిమా ని ఎనౌన్స్ చేసారు. ఇప్పుడు ఆ నిర్మాతగా ఆ సినిమా బిజీ ఉంటుంది. మరి ఆర్ ఆర్ ఆర్ కు టైమ్ కేటాయించేదెప్పుడు అనేది ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

దాంతో రామ్ చరణ్ కు మిగతా విషయాలపై దృష్టి తగ్గించి ఆర్ ఆర్ ఆర్ పై కాన్సర్టేట్ చేయమని రాజమౌళి మైల్డ్ గా వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కాని నిజానికి ఎన్టీఆర్ తో సీన్స్ తీస్తున్న రాజమౌళి ...రామ్ చరణ్ కు బ్రేక్ ఇచ్చారట. దాన్ని ఇలా సద్వినియోగ పరుచుకుంటున్నారట చరణ్. అంతేకాని ఆర్ ఆర్ ఆర్ ని ప్రక్కన పెట్టిందేమీ లేదట. మరో విషయం ఏమిటంటే...రాజమౌళి అలా ఎవరికీ వార్నింగ్ ఇచ్చే వ్యక్తి కాదు, పరిస్దితులను అర్దం చేసుకుంటూ తను ఎడ్జెస్ట్ అవుతూ ముందుకు వెళ్తాడని ఆయనతో పనిచేసిన వాళ్లు చెప్తారు. దాంతో రాజమౌళి వార్నింగ్ ఇచ్చాడనేది అబద్దం అని, మీడియా పుట్టించిన వార్తే అని తేలినట్లైంది.

Follow Us:
Download App:
  • android
  • ios