Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ కి ఎదురుచెప్తావా..? అంటూ ఆట పట్టించేవారు: గీతాంజలి

దాదాపు 400కి పైగా చిత్రాల్లో నటించిన ఆమె లెజండరీ నటుడు రామారావుని ఎదిరించి నటించాల్సి వచ్చిందట. అప్పటి సంఘటనలను గుర్తు చేస్తూ ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు షేర్ చేసుకుంది. 

Geetanjali Shares her Memories with ntr
Author
Hyderabad, First Published Oct 31, 2019, 10:28 AM IST

సీనియర్ నటి గీతాంజలి గురువారం నాడు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆమెను హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ఆసుపత్రిలోనే గురువారం నాడు కన్నుమూశారు.

దాదాపు 400కి పైగా చిత్రాల్లో నటించిన ఆమె లెజండరీ నటుడు రామారావుని ఎదిరించి నటించాల్సి వచ్చిందట. అప్పటి సంఘటనలను గుర్తు చేస్తూ ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు షేర్ చేసుకుంది. రామారావుగారి కుటుంబంతో తనకు ఎంతో అనుబంధం ఉండేదని, 'సీతారామకళ్యాణం' షూటింగ్ సమయంలో ఎక్కువగా వాళ్లింటిలోనే ఉండేవాళ్లమని చెప్పుకొచ్చింది.

ఆ స్టార్ హీరోతో పెళ్లిపై నటి గీతాంజలి ఏమన్నారంటే..?

ఉదయం 5 గంటలకు మేకప్ వేస్తే.. రాత్రి ఎప్పటికి పూర్తవుతుందో తెలియదని అన్నారు. రామారావుగారు రావణాసురుడు.. మొదటిరోజు భుజం మీద గద, కిరీటం అన్నీ పెట్టుకొని  'మాతులంగీ' అంటూ గట్టిగా పిలుస్తూ లోపలకి వచ్చారట. ఆయన ముందు భయపడకుండా ధైర్యంగా నిలబడి ఆయన్ని ధిక్కరిస్తూ పెద్ద డైలాగ్ గీతాంజలి చెప్పాలట. కానీ ఆయన్ని చూస్తేనే వణికిపోయేదాన్ని అంటూ గుర్తు చేసుకుంది గీతాంజలి.

''రావణాసురుడిలా ఆయన అలా నిలబడితే ఆయన్ని ఎదిరించే ఆ సీత పాత్రలో నటించడానికి ఎన్ని గుండెలు కావాలి..? మీకెంత ధైర్యం.. రామారావుగారికే ఎదురు చెబుతారా..'' అంటూ యూనిట్ సభ్యులంతా తనను ఆటపట్టించేవాళ్లని.. సీత పాత్ర మీద ఆయన చాలా శ్రద్ధ తీసుకునేవారని చెప్పుకొచ్చింది. 

గీతాంజలి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి. తెలుగుతో పాటు మళయాళం, హిందీ చిత్రాల్లో కూడ ఆమె నటించారు. 62 ఏళ్ల గీతాంజలి ఎన్టీఆర్ - ఏఎన్నార్ వంటి సీనియర్ యాక్టర్స్ తో నటించారు. 1961లో ఆమె మొదటిసారి తొలిసారిగా సీతారామ కళ్యాణం చిత్రం ద్వారా ఆమె సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఆ సినిమాలో సీతగా కనిపించి
మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అనంతరం సినీ కెరీర్ లో గీతాంజలి వెనక్కి తిరిగి చూసుకోలేదు. డాక్టర్ చక్రవర్తి, బొబ్బిలియుద్దం, దేవత,గూఢచారి 116 వంటి ఎన్నో డిఫరెంట్ సినిమాల్లో నటించారు.  పాత్ర ఏదైనా తన నటనతో సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేవారు, శ్రీశ్రీ మర్యాద రామన్న, కలవారి కోడలు, గుఢచారి 116, దేవత, నిండు హృదయాలువంటి సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు కూడా చాలా బాగా క్లిక్కయ్యాయి.  ఇక 1972 తరువాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. 20 ఏళ్ల అనంతరం మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios