Asianet News TeluguAsianet News Telugu

అల వైకుంఠపురములో.. స్టైలిష్ యాక్షన్ లుక్

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో యాక్షన్ లుక్ ని చిత్ర యూనిట్ అధికారికంగా రిలీజ్ చేసింది. డైరెక్టర్ త్రివిక్రమ్ మార్క్ కి తగ్గట్టుగా అల్లు అర్జున్ పర్ఫెక్ట్ గా స్టిల్ ఇచ్చినట్లు అర్ధమవుతోంది. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలో టేబుల్ మీద ఉండే ఫిన్నిస్ కి కూడా ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఇక అలా వైకుంఠపురములో కూడా అలాంటి తరహాలోనే సీన్స్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. 

ala vaikuntapuramulo allu arjun action look
Author
Hyderabad, First Published Oct 7, 2019, 4:51 PM IST

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో యాక్షన్ లుక్ ని చిత్ర యూనిట్ అధికారికంగా రిలీజ్ చేసింది. డైరెక్టర్ త్రివిక్రమ్ మార్క్ కి తగ్గట్టుగా అల్లు అర్జున్ పర్ఫెక్ట్ గా స్టిల్ ఇచ్చినట్లు అర్ధమవుతోంది. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలో టేబుల్ మీద ఉండే ఫిన్నిస్ కి కూడా ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.

ఇక అలా వైకుంఠపురములో కూడా అలాంటి తరహాలోనే సీన్స్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.  ఎర్రటి బట్టతో అల్లు అర్జున్ కూడా విలన్లను చితకొట్టినట్లు అర్ధమవుతోంది. గతంలో క్లాత్ తో త్రివిక్రమ్ ఇలాంటి మ్యాజిక్ లు చాలా చేశాడు. మరి ఈ సారి ఆ యాక్షన్ ఎపిసోడ్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక రీసెంట్ గా రిలీజైన సామజవరగమన సాంగ్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ala vaikuntapuramulo allu arjun action look

చూస్తుండగానే యూట్యూబ్ లో 20 మిలియన్ల వ్యూప్స్ ని అందుకుంది. ఇక ఇప్పుడు ఫస్ట్ లుక్ కూడా సినిమాపై అంచనాల డోస్ ని పెంచేసింది.  అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే కథానాయికగా ,నటిస్తుండగా టబు, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సుశాంత్, వెన్నెల కిశోర్, సునీల్, బ్రహ్మాజీ, మురళీ శర్మ, హర్ష వర్ధన్, సచిన్ ఖెడేకర్ కీలక పాత్రలు పోషించారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, గీతాఆర్ట్స్ ప‌తాకాల‌పై అల్లు అర‌వింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios