Asianet News TeluguAsianet News Telugu

అక్కినేని హీరో.. మరో 'అఖిల్' లాంటి సినిమా?

అఖిల్ కెరీర్ లో సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమా నుంచి ఎన్ని ప్రయోగాలు చేసినా వర్కౌట్ అవ్వడం లేదు. ఫస్ట్ మూవీ అఖిల్ కొట్టిన దెబ్బ నుంచి కోలుకోలేకపోతున్నాడు. లవ్ స్టోరీస్ తో అయినా హిట్టందుకుందాం అంటే అది కూడా వర్కౌట్ కావడం లేదు.

akhil akkineni new movie with kollywood director
Author
Hyderabad, First Published Oct 19, 2019, 4:57 PM IST

అక్కినేని యువ హీరో అఖిల్ కెరీర్ లో సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమా నుంచి ఎన్ని ప్రయోగాలు చేసినా వర్కౌట్ అవ్వడం లేదు. ఫస్ట్ మూవీ అఖిల్ కొట్టిన దెబ్బ నుంచి కోలుకోలేకపోతున్నాడు. లవ్ స్టోరీస్ తో అయినా హిట్టందుకుందాం అంటే అది కూడా వర్కౌట్ కావడం లేదు.

యూత్ ఫుల్ హీరోలందరు యూత్ ని ఎట్రాక్ట్ చేసేందుకు ఒక స్పెషల్ ఆలోచనతో ముందుకు వెళుతున్నారు.  కానీ అఖిల్ సొంతంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు. హలో - మిస్టర్ మజ్ను సినిమాలు కూడా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ప్లాప్ దర్శకుడైన బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక ప్రయోగం చేయబోతున్నాడు. ఆ సినిమాలో ఉండే యూనిక్ పాయింట్ యూత్ ని టార్గెట్ చేస్తుందని సమాచారం.

ఇక ఆ సినిమా అనంతరం అఖిల్ కోలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయబోతున్నట్లు టాక్ వస్తోంది.  విశాల్ తో అభిమన్యుడు అనే సినిమా చేసిన దర్శకుడు పిఎస్.మిత్రన్ నెక్స్ట్ 'హీరో' అనే సినిమాతో రాబోతున్నాడు. శివ కార్తికేయన్ ఆ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. అయితే ఆ సినిమా అనంతరం ఈ దర్శకుడు అఖిల్ తో ఒక ఫాంటసీ ఫిల్మ్ ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

గతంలో అఖిల్ తన మొదటి సినిమాను ఇదే జానర్ లో చేశాడు. ఆ సినిమా కాన్సెప్ట్ మంచిదే  అయినా మేకింగ్ లో తేడా కొట్టేయడంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. రీసెంట్ గా అఖిల్.. దర్శకుడు పిఎస్.మిత్రన్ ని అలాగే హీరో శివకార్తికేయను కలిసిన సంగతి తెలిసిందే. అప్పుడు మిత్రన్ కొత్త కాన్సెప్ట్ ని అఖిల్ కి వివరించాడట.

సినిమాలో అఖిల్ సూపర్ హీరో తరహాలో కనిపించే విధంగా ఒక ఫాంటసీ కథను డిజైన్ చేసుకున్నట్లు సమాచారం. మరి మొదటి సినిమాతో ఆ జానర్ లో కాస్త దెబ్బతిన్న అఖిల్ ఇప్పుడు ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ఇక బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్న సినిమా వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమాలో  పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios