Asianet News TeluguAsianet News Telugu

గుండెల్నీ చీరేసే ఈ సంఘటన నిన్న జరిగింది...

heart wrenching story of a neglected parents

సమయం...ఉదయం...7 గంటలవుతున్నది.

హైదరాబాద్ లో ఒక రైల్వే స్టేషన్...

రవి...రోజులానే రైల్వేస్టేషన్ లో తను అమ్మే టి కోసమని కప్పులు, టీ బ్యాగులు & కెటిల్ ను సర్దుకుంటున్నాడు.

అనుకోకుండా అతని చూపు ఎదురుగా ఉన్న ఒక వృద్ధ దంపతుల మీద పడింది, ఇద్దరూ చాలా ముసలి వాళ్ళు భర్త ఆసరాతో భార్య నెమ్మదిగా నడుస్తోంది కొంచెం దూరం వెళ్లి అక్కడ కూర్చుండి పోయింది..భర్త కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు. ఇంతలో రవి వెళ్లాల్సిన ట్రైన్ వచ్చేసింది.. తన సామానుతో టీ, కాఫి అంటు అరుచుకుంటూ బండి ఎక్కేసాడు....

తిరిగి సాయంత్రం రవి వచ్చేసరికి కూడా ఆ దంపతులు అక్కడే ఉన్నారు..రవి తన మనసులో......
(అరె..ఏంటి వీళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు..?అనుకున్నాడు) చీకటి పడుతోంది వాళ్ళు అక్కడి నుండి కదలలేదు అక్కడే ఉన్నారు.

రవి వాళ్ళని అలా చూస్తూ ఉండలేకపోయాడు...

దగ్గరికి వెళ్లి అమ్మ ఎవరు మీరు, ఉదయం నుండి చూస్తున్నా ఇక్కడే ఉన్నారు.ఎందుకని ఉన్నారు..?ఎక్కడికి వెళ్ళాలి..?ఎక్కడి నుండైనా వస్తున్నారా..?ఎవరైనా రావాలా..? (అని అడిగాడు)

ముసలతను జేబులో నుంచి ఒక కాగితం తీస్తూ..........

బాబు..! మా ఇద్దరిలో ఎవ్వరమూ చదువుకోలేదు ఇందులో మా పెద్దబ్బాయి అడ్రస్ ఉంది. ఒకవేళ వాడు ఏదైనా పనిలో ఉండి స్టేషన్ కి రాకపోతే ఎవరికయినా ఈ కాగితం చూపిస్తే అన్నయ్య ఉండే అడ్రస్ కు తీసుకువెళ్తారని మా చిన్నబ్బాయి రాసిచ్చాడు...

(అని ఆ పేపర్ ను రవి కి ఇచ్చాడు)

కాగితంలో రాసినది చదివిన రవికి నోటి నుంచి మాటరాలేదు.అతని కళ్ళలో కన్నీటి చుక్కలు ఒకొక్కటిగా నేల పై రాలుతున్నాయి.

ఆ కాగితంలో ఇలా రాసి ఉంది........

"దయచేసి వీరిద్దరినీ మీ టౌన్ లో ఉన్న ఏదైనా వృద్ధాశ్రమం లో జాయిన్ చేయండి.. మీకు అనేక కృతజ్ఞతలు".

***********************************
ఫ్రెండ్స్ ఇలాంటి కొడుకులను కనే కంటే పిల్లలు లేని దంపతులుగా మిగిలిపోవడమే మంచిది కదూ..!

మనలో కూడా ఇటువంటి కొడుకులు ఉంటే వారికి కనువిప్పు కలిగేలా దీనిని పది మందికి తప్పక చెప్పండి....Share చెయ్యండి..!

ముందు తరాలను కొద్దిగ అయిన బాగు పరచడానికి ప్రయత్నిద్దాం..!

 

 

(పేస్ బుక్  నుంచి)