Asianet News TeluguAsianet News Telugu

బ్యాంకుల్లో పల్లెటూరోళ్ల కష్టాలు ఇవి

farmers complain sbi harassing them with token system

స్టేట్ బ్యాంకు శాఖల్లో ప్రవేశపెట్టిన టోకెన్ సిస్టం

బ్యాంకు సిబ్బంది  దురుసు ప్రవర్తన వల్ల చాల మంది బ్యాంకు

గడప తొక్కడానికే ఇష్టపడటం లేదు పల్లెల్లో..!!

బ్యాంకుల్లో డబ్బులు మావి. కష్టాలూ మాకేనా...

ఎటిఎంలలో డబ్బు ఉంచరు..బ్యాంకుకు పోతే

గంటలు గంటలు లైనులో ఉంచుతారు..

అరె మా డబ్బు తీసుకొని వ్యాపారం చేస్తూ ..

మా మీదే కొంతమంది అధికారుల రుబాబా..!!

 

బ్యాంకు లో మహాత్మ గాంధీ ఫోటో పెట్టుకొని ..

అయన కొటేషన్లు అతికించింటారు కానీ ఒక్కటి

పాటించారు. ఖాతాదారులు దేవుళ్ళతో సమానమంటారు.

బ్యాంకు లలో హెల్ప్ డెస్క్ లు అసలే వుండవు..

ముసలివాళ్ళు చదువురాని వాళ్ళ గోడు వర్ణనాతీతం..!!

farmers complain sbi harassing them with token system

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఇంక పట్టణాల్లో ప్రధాన బ్యాంకు శాఖల ముందు ఉన్న

ఎటిఎం లు బ్యాంకు లకు ధిష్ఠిబొమ్మలు గా పనికొస్తున్నాయి

ప్రయివేట్ బ్యాంకుల దగ్గర ఎటిఎం లలో డబ్బు ఉండడం

ఏంది మీ దగ్గర లేకపోవడం ఏంది..!!

 

ఇండియా ఎమన్నా 100 శాతం అక్షరాస్యత సాధించింది

అనుకున్నారా. మీ ఇష్టం వచ్చి నట్లుగా డిజిటల్ ఇండియా

అని మీ ఇష్టానుసారం పట్టణామా పల్లెనా అని చూడకుండా

పల్లె బ్యాంక్ లను, చిన్న చిన్న బ్యాంక్ లను కలిపేస్తూ

ఒకే బ్యాంకు గా నెలకొల్పి ప్రజలను చావగొట్టాలనుకున్నారా!!

 

మీ బ్యాంకు లేమయిన ప్రపంచపు వింతలనుకున్నారా

కనీసం ఫోటోలు కూడా తీయద్దనేకి ఏమి చూసుకొని.!!

సమస్యలకయి వినతిపాత్రలిస్తే మా వేమయిన ప్రభుత్వ

కార్యాలయాలనుకున్నారా అంటారా..ప్రజలు బీదవారు

రైతుల సమస్యలు చెప్పుకుంటే ఈసడించుకుంటారా

ఏమనుకున్నారు..అడిగేవారు లేరనుకున్నారా ..!!

 

అందుకే ఈ రోజు గుత్తి ఎస్ బిఐ  బ్యాంకు మేనేజర్ ని

నిలదీయాల్సి వచ్చింది.  మీ అసందర్బ టోకెన్ సిస్టమ్

వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వెంటనే

ముసలివాళ్ళకు,వికలాంగులకు,పల్లె ప్రజలకు ప్రత్యేక

కౌంటర్లు ఏర్పాటు చేసి బ్యాంకు యొక్క ప్రగతికి దోహద

పడమని మేనేజర్ ను నిలదీయాల్సి వచ్చింది .వారం లోపు సమస్యలు

పరిష్కరిస్తామని హామీ ఇస్తూ సంతకం పెట్టించుకున్నాం..!!!

ఏమవుతుందో చూద్దాం.