Asianet News TeluguAsianet News Telugu

ఇంకెందుకు, చచ్చిపోదాం రండి !

can arrests and false cases silence the social media

"సోషల్ మీడియా" అన్నది ఒక సమాంతర కాల్పనిక సమాజం. సమాజంలో ఉన్న అన్ని రుగ్మతలూ, అన్ని భావోద్వేగాలూ ఇక్కడా ఉంటాయి. పదిమంది గుమికూడి పిచ్చాపాటీ మాట్లాడుకొంటూ ఎలాగైతే గడుపుతారో ఇక్కడకూడా అలాగే జరుగుతాయి.

 

ఒకప్పుడు నిన్న, మొన్నటి సంఘటనలను మరుసటిరోజు పేపర్లో చూసేవాళ్ళు. తదుపరి టి‌వి ఛానళ్ళు వచ్చాయి. రానురానూ మీడియాలో రాజకీయాలు చొరబడి సొంత ఎజెండా ను నిర్లజ్జగా అమలుపరస్తున్నాయి. ప్రస్తుతం మీడియా కూడా రాజకీయ పార్టీలవారిగా పూర్తి విభజింపబడింది. - మీడియా అన్నది ఆశ్రిత పక్షపాతానికీ, వివక్షకూ, తప్పుదోవపట్టించడానికీ విపరీతంగా వాడూకోబడుతూ ఉంది. .. ఒక్కమాటలో చెప్పాలంటే, నేటి మీడియా లో "న్యూస్" కాకుండా, వారి వారి "వ్యూస్" మాత్రమే వస్తున్నాయి. .

 

ఇక ఈ సోషల్ మీడియా ఉధృతమైన గత కొన్నేళ్ళుగా సమాచార వ్యాప్తి అన్నది కాంతివేగంతో జరుగుతూ ఉంది. ప్రపంచంలో ఏమూలన చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో ప్రపంచమంతా తెలిసిపోతూ ఉంది. దీంతో వ్యక్తులు కూడా వారివారి అభిప్రాయాలను, ఇంటరెస్ట్లనూ ప్రపంచంతో పంచుకోవడానికి సోషల్ మీడియా ను విస్తుతంగా ఉపయోగించడం మొదలయ్యింది. . .... ఆవిధంగా సోషల్ మీడియా అన్నది ఒక సమాంతర సమాజంగా మారిపోయింది!

 

మరిప్పుడు, ఆ సోషల్ మీడియా వేధికగా జనాలు వారివారి అభిప్రాయాలను ధైర్యంగా చెప్పుకోగలిగే అవకాశం ఉందా ??? . => మన రాజ్యాంగం ప్రవచిస్తున్న "భావప్రకటన స్వేచ్చ"ను నిర్భయంగా వాడుకొనే పరిస్థితులున్నాయా ?

 

ఈ సోషల్ మీడియా లో కూడా అన్నిరకాల జాడ్యాలూ వ్యాపించాయి

 

ఎవరైనా తన అభిప్రాయాన్ని చెబితే చాలు, ఇమ్మీడీయట్ గా ఎదుటిపక్షం నుండి దాడి మొదలవుతుంది. అరె, ఇదెక్కడి దౌర్భాగ్యం ? ఒకరి అభిప్రాయాలు అందరికీ నచ్చాలని లేదు. అలాగని తనకు నచ్చని అభిప్రాయాలను చెప్పేవారిపై దాడులు చేస్తారా ? (ఇక్కడ దాడి అంటే కేవలం భౌతిక దాడి మాత్రమే కాదు).

 

ఎవరి అభిప్రాయాలు వారు నిర్భయంగా చెప్పుకోలేని పరిస్థితులున్నప్పుడు "రాజ్యాంగం - ప్రజాస్వామ్యం - భావ వ్యక్తీకరణ స్వేచ్చ" అంటూ పెద్దపెద్ద మాటాలెందుకు ? . ..... అసలు సమస్య ఎక్కడుంది? . సమస్యంతా రాజకీయాల దరికే చేరుతుంది.. సమస్యలకు మూలమంతా రాజకీయాలనుండే మొదలవుతుంది.

 

. ఇక అధికారంలో ఉన్న పక్షాల ఆగడాలకు అంతే లేదు. వాళ్ళ తరఫున పుంఖానుపుంఖాలుగా ఉన్న గుంపులతో, చీమను చూపి డైనోసార్ లాగా అవాస్తవాలను అదేపనిగా ప్రచారం చేయిస్తారు. వాళ్ళ ప్రభుత్వం స్వర్గాన్ని దించేసిందంటూ అభూతకల్పనలను అల్లెస్తాయి. అవే విషయాలను వాళ్ళ సొంత మీడియా లో కూడా అదేపనిగా ప్రచారం చేయిస్తారు. మరి వాస్తవాలు ప్రజలకు ఎలా తెలియాలి ??? - రాజకీయాలూ - మీడియా కలగలిసిపోయి ఒక భయంకరమైన అణచివేత ఆట ఆడుతున్నాయి. అక్కడే సోషల్ మీడియా కనిపించింది.. కారుచీకట్లో ఒక చిరుదివ్వే..!! - వాస్తవాలను నిర్భయంగా చెప్పుకోవడానికి ప్రతిఒక్కరికీ దొరికిన ఒక అస్త్రం. !!

 

అయితే ఇప్పుడు ఆ ఆ చిరుదీపాన్ని కూడా చిదిమే ప్రయత్నంలో ఎంతకైనా తెగించడానికి వెనుకాడడంలేదీ ప్రభుత్వాలు. ఎందుకంటే, వారెన్ని ప్రయత్నాలు చేసినా, వాస్తవాలను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోలేకపోవడమే వాళ్ళ ఆగ్రహానికి కారణం. . >> చిన్న విమర్శను కూడా తట్టుకోరు. ప్రతిఒక్కరూ వాళ్ళ విదూషకులుగా మారి పొగుడుతూనే ఉండాలనుకొంటున్నారు. వాళ్ళ అడ్డగోలు వ్యవహారాలనూ, ప్రజావ్యతిరేక విధానాలనూ అస్సలు ప్రశ్నించకూడదు అనుకొంటున్నారు. విమర్శలు సరే, కనీసం వాస్తవాలను కూడా ప్రజలకు తెలియకూడదు అన్న ఒక భయంకరమైన ఐడియాలజీతో ఉన్నాయీ ప్రభుత్వ పెద్దల ఆలోచనలు.

 

చివరిగా వాళ్ళు ఎంచుకొన్న దారి "అణచివేత" - "బెదిరింపులు" - "తప్పుడుకేసులు పెట్టడం"  వాళ్ళకు వ్యతిరేకంగా ఏ గళం వినిపించినా, ముందు వాళ్ళ సోషల్ మీడియా దండు దాడులు మొదలు పెడుతుంది. తదుపరి సొంత మీడియా వాళ్ళు అదేపనిగా బ్రేకింగు లు వేస్తారు. అయినా కుదరకపోతే, వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసి, "స్వేచ్చాయుత భావప్రకటనను అణచివేయడానికి" ఎంతకైనా తెగిస్తుంది ప్రభుత్వం. ఇక ఏఒక్కరూ మన రాజ్యాంగం ప్రవచిస్తున్న "భావ వ్యక్తీకరణ స్వేచ్చ"ను నిర్భయంగా వినియోగించుకోలేని భయానక పరిస్థితులను కల్పిస్తూ ఒక ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టించివేసింది. "హద్దులు దాటవద్దు" అంటూ లక్ష్మణ రేఖలు గీస్తూ ఉంది ?

 

హద్దులు దాటవద్దు అంటే ? ఏది హద్దు ? ఆ హద్దును ఎవరు నిర్ణయించాలి ? - నీకు నచ్చనివి వినిపిస్తే హద్దులు మీరినట్లేనా ? ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదూ ?

 

ఏడు దశాబ్దాల ఈ స్వతంత్ర్య భారతంలో చాలా సాధించేశాం.. కనీసం మన భావాలను నిర్భయంగా చెప్పుకోలేని పరిస్థితులను చేరుకోన్నాం. ఈ ఘనతంత్ర - గణతంత్ర దేశాన్ని చూసి గర్వపడాలా ? సిగ్గుతో చావాలా ?  పేరుగొప్ప-ఊరు దిబ్బలా ఉన్న ఈ దేశంలో, భావప్రకటన స్వేచ్చకు తావులేనప్పుడు ఇక బ్రతకడమెందుకూ?

 

చచ్చిపోదాం రండి..!! .